Corona Cases : భారత్ లో మళ్లీ విజృంభిసృన్న కరోనా..12,847 కొత్త కేసులు

దేశంలో కరోన రికవరీ రేటు 98.64 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 7985 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,26,82,697 మంది కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Corona Cases : భారత్ లో మళ్లీ విజృంభిసృన్న కరోనా..12,847 కొత్త కేసులు

COVID-19

corona new cases : భారత్ లో మరోసారి కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,847 కొత్త కేసులు, 14 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 63,063 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో 0.15 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 4,32,70,577 కేసులు, 5,24,817 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో కరోన రికవరీ రేటు 98.64 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 7985 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,26,82,697 మంది కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

దేశంలో వరుసగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఇటీవలి కాలంలో బూస్టర్ డోసు తీసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. గత పదిహేను రోజుల్లోనే దేశవ్యాప్తంగా 47.5 లక్షల మంది వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్నారు. అంతకుముందు 15 రోజుల్లో 41.5 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకుంటే, తాజాగా 6 లక్షల మంది ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకున్నారు.

Covid-19: కరోనా తగ్గిన చిన్నారుల్లో కాలేయ వ్యాధి ముప్పు

కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం, బూస్టర్ డోసు తీసుకుంటే కరోనా ప్రభావం తక్కువగా ఉంటుందని జనం నమ్మడమే దీనికి కారణం. తాజా నివేదిక ప్రకారం మెట్రో నగరాల్లో బూస్టర్ డోసులు ఎక్కువగా తీసుకుంటున్నారు. గత వారం 77.9 శాతం బూస్టర్ డోసులు మెట్రో నగరాల్లోనే తీసుకున్నారు. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై నగరాల్లో ప్రజలు బూస్టర్ డోసులపై ఆసక్తి చూపిస్తున్నారు. తాజా నివేదిక ప్రకారం అరవై ఏళ్లకు తక్కువ వయసున్న వాళ్లు కూడా బూస్టర్ డోసులు తీసుకుంటున్నారు.