Agni-5 Ballistic Missile : అగ్ని-5 మిస్సైల్ టెస్ట్‌ సక్సెస్‌తో ఇక చైనాకు చుక్కలే… బోర్డర్‌లో క్లాష్‌ మొదలైతే.. స్మాష్ చేస్తామంటూ భారత్ వార్నింగ్

చైనా తోక జాడించినా ఇప్పుడు ఇండియా ఎలాంటి టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. బోర్డర్‌లో అన్నిటికీ భారత్ రెడీగా ఉంది. పైగా.. బీజింగ్‌ని సైతం టార్గెట్ చేసే అగ్ని-5 మిస్సైల్ టెస్ట్ కూడా సక్సెస్ అయింది. ఫ్రాన్స్ నుంచి ఆఖరి రాఫెల్ ఫైటర్ జెట్ కూడా మన బేస్‌లో ల్యాండ్ అయిపోయింది. సో.. ఇప్పుడు టెన్షన్ మనవైపు కాదు.. ఎల్ఏసీకి అవతలి వైపు..

Agni-5 Ballistic Missile : అగ్ని-5 మిస్సైల్ టెస్ట్‌ సక్సెస్‌తో ఇక చైనాకు చుక్కలే… బోర్డర్‌లో క్లాష్‌ మొదలైతే.. స్మాష్ చేస్తామంటూ భారత్ వార్నింగ్

India successfully test fires Agni-5, ballistic missile

India successfully test fires Agni-5 : భారత్-చైనా సరిహద్దులు మరోసారి ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. అరుణాచల్‌లోని తవాంగ్ సెక్టార్‌లో.. రెండు దేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణతో.. ఎల్ఏసీ వెంబడి..ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా ఎలాంటి టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. లోడ్ చేసిన గన్నులా.. బోర్డర్‌లో భారత్ రెడీగా ఉంది. పైగా.. బీజింగ్‌ని సైతం టార్గెట్ చేసే అగ్ని-5 మిస్సైల్ టెస్ట్ కూడా సక్సెస్ అయింది. ఫ్రాన్స్ నుంచి ఆఖరి రాఫెల్ ఫైటర్ జెట్ కూడా మన బేస్‌లో ల్యాండ్ అయిపోయింది. సో.. ఇప్పుడు టెన్షన్ మనవైపు కాదు.. ఎల్ఏసీకి అవతలి వైపు..

లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి ఉన్న సరిహద్దుల్లో.. చైనా పదే పదే కయ్యానికి కాలు దువ్వుతోంది. బోర్డర్‌లో కవ్విస్తున్న డ్రాగన్‌కు.. ఇండియా ఊహించని షాక్ ఇచ్చింది. అగ్ని-5 మిస్సైల్ టెస్ట్‌తో.. ఆగ్నేయాస్త్రాన్ని సంధించింది. హద్దు మీరినా.. బోర్డర్ దాటినా.. ఇక చూస్తూ ఊరుకోబోమనే సాలిడ్ వార్నింగ్ పంపింది. ఇండియా సొంతంగా డెవలప్ చేసిన.. న్యూక్లియర్ క్యాపబుల్ అగ్ని-5 మిస్సైల్‌ టెస్ట్ సూపర్ సక్సెస్ అయింది. తొలిసారి రాత్రి పూట జరిపిన ఈ ప్రయోగం.. విజయవంతంగా ముగిసింది. తవాంగ్ సెక్టార్‌లో చైనాతో ఉద్రిక్తత పరిస్థితులకు ముందే.. అగ్ని-5 మిస్సైల్ టెస్ట్ కన్ఫర్మ్ అయింది. దీనికి సంబంధించి.. నోటీస్ టు ఎయిర్‌మెన్ వెల్ కూడా జారీ చేశారు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి దీన్ని ప్రయోగించారు.

భారత్ వ్యూహాత్మకంగానే అగ్ని-5 మిస్సైల్ టెస్ట్ చేపట్టినట్లు తెలుస్తోంది. మా జోలికొస్తే.. స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటుందనే హెచ్చరికలు పంపినట్లయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తే.. జిన్‌పింగ్‌ పాలనలో అంతకంటే పెద్ద తప్పిదం మరొకటి ఉండదు. దశాబ్దాల పాటు బోర్డర్‌లో చైనా ఏం చేసినా.. భారత్ శాంతిమంత్రం జపించింది. కానీ.. ఇప్పుడు ఇండియా రణతంత్రం ఎలా ఉంటుందో చూడాల్సి వస్తుంది. అందువల్ల.. డ్రాగన్ సైన్యం ఏమాత్రం తోక జాడించినా.. వెంటనే రెస్పాండ్ అయ్యేందుకు.. వేల మంది సైన్యం కన్నులతో.. ఫుల్లుగా లోడ్ చేసిన గన్నులా భారత్ రెడీగా ఉంది. ఈ ఫోర్స్‌కి తోడు.. అగ్ని-5 మిస్సైల్ కూడా రెడీ అయిపోయింది. దాంతో.. ఏకంగా చైనా రాజధాని బీజింగ్‌నే టార్గెట్ చేయొచ్చు. ఇండియాలో కూర్చొని.. ఒక్క బటన్ నొక్కితే చాలు.. నిమిషాల్లోనే బీజింగ్‌లో బొంబాట్ బ్లాస్ట్ జరిగిపోతుంది. అగ్ని-5 న్యూక్లియర్ క్యాపబుల్ మిస్సైల్. దీంతో.. లాంగ్ రేంజ్ టార్గెట్లపై అణుబాంబులను కూడా ప్రయోగించొచ్చు.

అగ్ని-5 ఆపరేషనల్ రేంజ్.. 5 వేల 5 వందల కిలోమీటర్ల పైనే. చైనాలోని.. బీజింగ్ సహా భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లోని కీలక నగరాలన్నీ ఈ అణ్వాయుధ క్షిపణి రేడియస్‌ కిందకే వస్తాయ్. ఉత్తర ప్రాంతంలోని చాలా భాగం అగ్ని-5 పరిధిలోకి వచ్చేసింది. నిజానికి.. ఈ మిస్సైల్ రేంజ్ 5500 కిలోమీటర్లే అని చెబుతున్నా.. దాదాపు 8 వేల కిలోమీటర్లు ఉంటుందని.. చైనా సహా మరికొన్ని దేశాలు అనుమానిస్తున్నాయ్. ఆసియాలోని అన్ని దేశాలతో పాటు యూరప్‌లోని కొన్ని ప్రాంతాలను కూడా అగ్ని-5 రీచ్ కాగలదు. అగ్ని-5 మిస్సైల్ పొడవు 17.5 మీటర్లు, డయామీటర్ 2 మీటర్లు, బరువు.. 50 వేల కిలోలు. 1500 కిలోల న్యూక్లియర్ వార్‌హెడ్‌లను మోసుకెళ్లే కెపాసిటీ దీని సొంతం. 3 స్టేజ్.. సాలిడ్ ఇంజిన్‌తో ఇది పనిచేస్తుంది. గంటకు 29 వేల కిలోమీటర్లకు పైగా వేగంతో.. ఇది ప్రయాణిస్తుంది.

పదిహేనేళ్లుగా భారత్ దేశీయంగా మీడియం అండ్ లాంగ్ రేంజ్ మిస్సైళ్లను అభివృద్ధి చేస్తోంది. అగ్ని సిరీస్‌లో.. ఇది ఐదవది. దీనికంటే ముందు వచ్చిన నాలుగు మిస్సైళ్లను కూడా విజయవంతంగా పరీక్షించారు. 2012లో తొలిసారి అగ్ని-1 మిస్సైల్‌ని టెస్ట్ చేశారు. తర్వాత.. అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4 మిస్సైళ్లను అభివృద్ధి చేశారు. 2015లో టెస్ట్ చేసిన అగ్ని-4 మిస్సైల్ రేంజ్ 4 వేల కిలోమీటర్లు. ఇప్పుడు దానిని మించిన రేంజ్‌, స్పీడ్‌, టెక్నాలజీతో అగ్ని-5ని డెవలప్ చేశారు. అగ్ని సిరీస్‌లో వచ్చిన మిస్సైల్‌ని తొమ్మిదోసారి సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించారు. అవసరమైతే.. 5 వేల కిలోమీటర్ల రేంజ్‌ని మరింత పెంచుకోవచ్చు. 5 వేల 4 వందల కిలోమీటర్ల లోపు టార్గెట్లనైతే.. ఈ మిస్సైల్ అత్యంత కచ్చితత్వంతో చేధించగలదు. అందువల్ల.. దీనిని ఇంటర్-కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్‌గా పిలుస్తున్నారు. అగ్ని-5 లాంటి మిస్సైళ్లు… అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దగ్గర మాత్రమే ఉన్నాయి. చైనా దగ్గర మనకన్నా పవర్‌ఫుల్ మిస్సైళ్లు ఉన్నాయ్. 13 వేల కిలోమీటర్ల రేంజ్ ఉన్న క్షిపణి డ్రాగన్ దగ్గర ఉంది. అగ్ని-5 రేంజ్ అంత లేకపోయినా.. బీజింగ్‌ని టార్గెట్ చేసే సత్తా మాత్రం దానికుంది. అదొక్కటి చాలు.. డ్రాగన్‌కి వణుకు పుట్టించేందుకు. పైగా.. చైనా మిస్సైల్స్‌తో మనకు దాదాపు ముప్పు తప్పినట్లేనని చెప్పొచ్చు.

ఇక.. భారత గడ్డ మీదకు ఆఖరి రాఫెల్ ఫైటర్ జెట్ కూడా ల్యాండ్ అయింది. దీంతో.. భారత్-ఫ్రాన్స్ మధ్య ఒరిగిన ఒప్పందం మేరకు 36 రాఫెల్ ఫైటర్ జెట్లు భారత్‌కు వచ్చేశాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోరినట్లుగానే.. మరింత అడ్వాన్స్‌ టెక్నాలజీతో.. రాఫెల్ ల్యాండ్ అయింది. దీంతో.. దసాల్ట్ కంపెనీతో.. భారత ప్రభుత్వం చేసుకున్న డీల్ కూడా ముగిసింది. ఈ మేరకు రాఫెల్ ఫ్లీట్ ప్యాక్ పూర్తయిందని.. ఐఏఎఫ్ తెలిపింది. రాఫెల్ ఫైటర్ జెట్స్ అన్నీ వచ్చేయడంతో.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో కొత్త జోష్ వచ్చింది.

కొత్తగా వచ్చిన రాఫెల్‌ జెట్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి. దీని పొడవు 15 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు, ఎత్తు ఐదున్నర మీటర్లు ఉంటుంది. గంటకు 1,389 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. రాఫెల్ 3,700 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 50 వేల అడుగుల ఎత్తుకు ఎగరగలదు. గాల్లోనే.. ఇంధనాన్ని నింపుకోగల వ్యవస్థ కూడా ఉంది. ఒకేసారి 9 వేల 500 కిలోల బరువున్న ఆయుధాలను మోసుకెళ్లగలదు. రాఫెల్ రేంజ్ 3 వందల కిలోమీటర్లు. ఒక్కసారి మిస్సైల్ ఫైర్ చేస్తే.. టార్గెట్ స్మాష్ అవ్వాల్సిందే.

సరికొత్త హంగులతో భారత్‌లో అడుగుపెట్టిన రాఫెల్.. ఇప్పటికే వచ్చిన 35 కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కంటే.. పవర్‌ఫుల్‌‌గా పనిచేయగలదు. ఎయిర్‌ఫోర్స్ సూచన మేరకు.. ఇందులో అడ్వాన్స్‌డ్ రేడీయో ఆల్టీమీటర్, రాడార్‌ వార్నింగ్‌ రిసీవర్‌, లో-బ్యాండ్ జామర్‌, ఫైట్‌ డేటా రికార్డర్‌, హై ఆల్టిట్యూడ్‌ ఇంజిన్‌ స్టార్టప్‌, సింథటిక్‌ అపాచర్‌ రాడార్‌, గ్రౌండ్‌ మూవింగ్‌ టార్గెట్‌ ఇండికేటర్లను ఏర్పాటు చేశారు. ట్రాకింగ్‌, ఇన్‌ఫ్రారెడ్‌ సెర్చ్‌ ట్రాక్‌, హెల్మెట్‌ మౌంటెడ్‌ డిస్‌ప్లే, మిస్సైల్‌ అప్రోచ్‌ వార్నింగ్‌ సిస్టమ్‌ ఉన్నాయి. లద్దాఖ్‌లో చైనాతో వివాదం ఉద్ధృతంగా ఉన్న సమయంలోనే.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళంలోకి రాఫెల్‌ని చేర్చారు. దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన వారంలోనే.. పనిచేయడం మొదలుపెట్టింది. రాఫెల్‌తో పాటు సుఖోయ్-30 యుద్ధ విమానాలను ఆపరేట్ చేస్తున్న మొట్టమొదటి దేశం భారత్ మాత్రమే. అందువల్ల.. సరిహద్దుల్లో చైనా ఆర్మీ ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా.. భారత భూభాగాన్ని ఆక్రమించాలని చూసినా.. ఇండియా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉంది.