Indian Army : కేంబ్రియన్ పెట్రోల్ 2023 సైనిక విన్యాసాల్లో భారత సైన్యానికి బంగారు పతకం

యూకేలోని వేల్స్‌లో జరిగిన కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్ 2023 ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లో భారత సైన్యం బంగారు పతకాన్ని గెలుచుకుంది.....

Indian Army : కేంబ్రియన్ పెట్రోల్ 2023 సైనిక విన్యాసాల్లో భారత సైన్యానికి బంగారు పతకం

Indian Army wins gold medal

Indian Army : యూకేలోని వేల్స్‌లో జరిగిన కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్ 2023 ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లో భారత సైన్యం బంగారు పతకాన్ని గెలుచుకుంది. గూర్ఖా రైఫిల్స్ బృందం యూకేలోని వేల్స్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మకమైన కేంబ్రియన్ పెట్రోల్ ఎక్సర్‌సైజ్‌లో భారత సైన్యం తరపున ప్రాతినిధ్యం వహించిందని ఆర్మీ తెలిపింది. ఇండియన్ ఆర్మీ టీమ్ ఈ ఈవెంట్‌లో పాల్గొంది.

Also Read :Anushka Sharma : విరాట్ కోహ్లీకి మద్ధతుగా అహ్మదాబాద్ చేరుకున్న అనుష్కశర్మ

ఆర్మీ 111 జట్లతో పోటీ పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక దళాలు,ప్రతిష్ఠాత్మక రెజిమెంట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 38 అంతర్జాతీయ జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ప్రపంచంలోని మిలిటరీల మధ్య సైనిక పెట్రోలింగ్ ఒలింపిక్స్ అని పిలుస్తారు. ఇండియన్ ఆర్మీ బృందం వేల్స్‌లోని పర్వతాలు, చిత్తడి నేలల్లో వ్యూహాత్మక కార్యకలాపాలు సాగించింది.

Also Read :Gaza tunnels : గాజాలోని హమాస్ రహస్య సొరంగాలపై దాడి…ఇజ్రాయెల్‌ సైన్యానికి సవాలు