గూగుల్ Trends : TikTok యాప్ కోసం తెగ వెతికేస్తున్నారు

ఇండియాలో టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించారు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా ఈ యాప్ మాయమైపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో భారత ప్రభుత్వం టిక్ టాక్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించాల్సిందిగా సూచించింది.

  • Published By: sreehari ,Published On : April 17, 2019 / 07:30 AM IST
గూగుల్ Trends : TikTok యాప్ కోసం తెగ వెతికేస్తున్నారు

ఇండియాలో టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించారు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా ఈ యాప్ మాయమైపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో భారత ప్రభుత్వం టిక్ టాక్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించాల్సిందిగా సూచించింది.

ఇండియాలో టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించారు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా ఈ యాప్ మాయమైపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో భారత ప్రభుత్వం టిక్ టాక్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించాల్సిందిగా గూగుల్, ఆపిల్ కు సూచించింది. గూగుల్, ఆపిల్ తమ యాప్ ప్లే స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్ ను తొలగించాయి. టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించిన కొన్ని గంటల్లోనే ఇండియాలో కోట్లాది మంది యూజర్లు ఆ యాప్ కోసం తెగ వెతికేస్తున్నారు. ఇండియాలో 100 మిలియన్లు (10 కోట్ల మంది) యూజర్లు టిక్ టాక్ యాప్ వాడుతున్నారు. దేశంలో ఒక నిమిషానికి వేలాది మంది యూజర్లు టిక్ టాక్ యాప్ యూజర్లుగా చేరుతున్నారు.

ఇండియాలో టిక్ టాక్ యాప్ బ్యాన్ చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను యూజర్లు వెతుకుతున్నారు. తమ స్మార్ట్ ఫోన్లలో TikTok యాప్ ను ఎలా డౌన్ లోడ్ చేయాలి అనేదానిపై ఇండియన్ యూజర్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. రీసెంట్ గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ లో టిక్ టాక్ యాప్ టాప్ లో నిలిచింది. టిక్ టాక్ యాప్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి. ఎలా స్మార్ట్ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోవాలంటూ గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. 

గూగుల్ సెర్చ్ గ్రాఫ్ లో రెడ్ లైన్ భారీగా పెరిగిపోయినట్టు గుర్తించారు. ఇప్పటికే గూగుల్, ఆపిల్ తమ యాప్ స్టోర్ల నుంచి టిక్ టాక్ యాప్ ను తొలగించడంతో యూజర్లంతా ప్రత్యామ్నాయ మార్గాలను శోధిస్తున్నారు. ఐఫోన్ యూజర్లకు మాత్రం టిక్ టాక్ యాప్ కష్టమే. కానీ, ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రం థర్డ్ పార్టీ యాప్ స్టోర్లు కోసం తెగ వెతికేస్తున్నారట. 
Indians Searching for TikTok App and How To Install more times After Ban in country

ఆండ్రాయిడ్ యూజర్లు కేవలం గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే కాదు.. ఇతర Apps స్టోర్ల నుంచి కూడా యాప్స్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఇలాంటి అన్ అఫిషియల్ యాప్స్ ను స్మార్ట్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకుంటే సెక్యూరిటీ రిస్క్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
Read Also : సంచలనం : టిక్ టాక్ యాప్ బ్లాక్ చేసిన గూగుల్