Super Bikes : Yamaha FZ-1, Honda CBR 600RR లాంటి సూపర్ బైక్స్… దుమ్ముకొట్టుకుపోతున్నాయ్…

Yamaha FZ-1, Honda CBR 600RR.. ఇవన్నీ సూపర్ బైక్స్... కానీ, దుమ్ముకొట్టుకుపోతున్నాయ్... ముంబైలోని అంథేరీ పోలీస్ స్టేషన్ లో ఈ బైక్స్ కనిపించాయి. పోలీస్ స్టేషన్ లో ఓ మూలన పడి ఉన్న వాటిలో Honda CBR 1000RR Fireblade, Honda CBR 600RR,

Super Bikes : Yamaha FZ-1, Honda CBR 600RR లాంటి సూపర్ బైక్స్… దుమ్ముకొట్టుకుపోతున్నాయ్…

Super Bikes

Super Bikes : Yamaha FZ-1, Honda CBR 600RR.. ఇవన్నీ సూపర్ బైక్స్… కానీ, దుమ్ముకొట్టుకుపోతున్నాయ్… ముంబైలోని అంథేరీ పోలీస్ స్టేషన్ లో ఈ బైక్స్ కనిపించాయి. పోలీస్ స్టేషన్ లో ఓ మూలన పడి ఉన్న వాటిలో Honda CBR 1000RR Fireblade, Honda CBR 600RR, Yamaha FZ-1, Honda CBR 600RR ఉన్నాయి.

super bikes

అయితే ఇవన్నీ ఇల్లీగల్ గా కొన్నుకున్నవి. అందుకే పోలీసులు సీజ్ చేసి ఇలా స్టేషన్ లో పెట్టారు. ఆ బైక్స్ ఎండకు ఎండుతున్నాయి. వానకు తడుస్తున్నాయి. చివరికి దుమ్ముపట్టిపోయాయ్. ఈ దృశ్యాలు.. సూపర్ బైక్స్ లవర్స్ ను ఎంతగానో బాధిస్తున్నాయి.

super bikes

ఇదే పోలీస్ స్టేషన్ గ్యారేజ్ లో Honda Repsol బైక్ కూడా ఉంది. Honda CBR600 లో ఇది చాలా పాపులర్ బైక్. అయితే దుమ్ము పట్టి ఉన్న ఈ పరవ్ ఫుల్ బైక్ ను దుస్థితిలో చూస్తే బాధ కలగక మానదు.

super bikes

ఇక Honda CBR600RR.. ఈ బైక్ కూడా ఇక్కడ దర్శనం ఇచ్చింది. ఇది చాలా రేర్ ప్రొడక్ట్. Yamaha FZ-1 కూడా ఇక్కడే ఉంది. బాగా డ్యామేజ్ అయి ఉంది. ఏదో యాక్సిడెంట్ కేసులో దీన్ని సీజ్ చేసి స్టేషన్ లో పెట్టినట్టు అనిపిస్తుంది. కస్టమ్స్, ప్రభుత్వం ఆంక్షల కారణంగా CBU 600cc మోటార్ సైకిల్ అమ్మడం కష్టం. దీనికి తోడు హెవీ ట్యాక్స్ లు.

super bikes

ట్యాక్స్ లు ఎక్కువగా ఉన్న కారణంగా కొందరు వ్యక్తులు ఇలాంటి పవర్ బైక్స్ ను అడ్డదారిలో తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో డీఆర్ఐ అధికారులు వీటిని పట్టుకుని సీజ్ చేస్తున్నారు. అలా పట్టుకున్న బైక్ లకు భారీగా ఫైన్లు వేస్తున్నారు. ఎంత ఫైన్ వేస్తున్నారంటే… ఆ బైక్ ఒరిజనల్ ధరకన్నా ఎక్కువగా ఫైన్లు వేస్తున్నారు. దీంతో బైక్ ఓనర్లు అంత డబ్బు కట్టలేక సైలెంట్ అవుతున్నారు. బైక్ లను అలానే వదిలేస్తున్నారు. ఈ క్రమంలో పవర్ బైక్ లు దుమ్ముకొట్టుకుపోతున్నాయ్..

super bikes