యుద్ధ నౌకలో మంటలు, నేవీ ఆఫీసర్ మృతి

పొగ ప్రదేశాన్ని చుట్టుముట్టి గాలి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే నేవీ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. 

యుద్ధ నౌకలో మంటలు, నేవీ ఆఫీసర్ మృతి

పొగ ప్రదేశాన్ని చుట్టుముట్టి గాలి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే నేవీ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. 

భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం సంభవించింది. కర్ణాటకలోని కర్ వార్‌లో హార్బర్ లోకి ప్రవేశించే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. హఠాత్తుగా కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో వాటిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. 

ఈ క్రమంలో ప్రమాదాన్ని నివారించేందుకు బాధ్యత తీసుకుని పోరాడిన నౌకాదళ అధికారి లెఫ్టినెంట్ కమాండర్ డీఎస్ చౌహాన్ మృతి చెందారు. పొగ ప్రదేశాన్ని చుట్టుముట్టి గాలి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే నావల్ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. 

ఈ ప్రమాదానికి కారణాలపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య 284మీటర్ల పొడవు, 60మీటర్ల ఎత్తుతో ఉంది. 40వేల టన్నుల వరకూ మోసుకెళ్లగల సామర్థమున్న నౌకలో 20బిల్డింగ్‌లు ఉన్నాయి. భారత నేవీలోనే అత్యంత పెద్దది.. బరువైన నౌక ఇది. 
Also Read : ఎలక్షన్ అఫిడవిట్ : మోడీ ఆస్తులు ఎంతంటే?