Rashtrapati election : ఉత్కంఠ రేపుతున్న రాష్ట్రపతి ఎన్నికల రేసు..
రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది.

Rashtrapati election : రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది.విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు అన్నది ఉత్కంఠను రేపుతోంది. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే అభ్యర్దికి మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అదే సమయంలో విపక్షాలు కూడా తమ తరఫున ఉమ్మడి అభ్యర్ధిని రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నాయి. బుధవారం (15,2022) ఇదే అంశంపై ఢిల్లీలో విపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఇలాంటి సమయంలో విపక్ష పార్టీల్లో కీలక నేత శరద్ పవార్ ట్విస్ట్ ఇచ్చారు. తాను రాష్ట్రపతి అభ్యర్థుల రేసులో లేను అని స్పష్టంచేశారు.
ఎలాగూ బీజేపీ అభ్యర్థే విజయం సాధిస్తారని..తాను ఓడిపోయే రేసులో ఉండటం ఎందుకని భావించి ఆఖరి సమయంలో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. దీంతో విపక్షాలు ఎన్డీఏ అభ్యర్థికి ధీటైన అభ్యర్థిని ఎన్నుకునే పనిలో పడ్డాయి. దీని కోసం రేపు విపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న శరత్ పవార్..మధ్యాహ్నాం కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరితో సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమయ్యారు.రాష్ట్రపతి బరిలో తాను ఉండటంలేదని తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో అధికార ఎన్డీయే తమ అభ్యర్ధిని ప్రకటించబోతోంది. అదే సమయంలో విపక్షాలు కూడా దీనికి పోటీగా తమ అభ్యర్దిని రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు కావాల్సిన 10.86 లక్షల ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లలో కేవలం 13 వేల ఓట్ల దూరంలో ఉన్న ఎన్డీయేకు వైసీపీతో పాటు ఇతర పార్టీలు మద్దతు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో విపక్షాలు నిలబెట్టే అభ్యర్ధిపై ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా నిన్నమొన్నటి వరకూ ప్రచారంలోకి వచ్చిన శరద్ పవార్ చివరి నిమిషంలో తప్పుకున్నారు. పవార్ నిర్ణయం వెనుక విజయంపై ఆయనకు ఎలాంటి ఆశలు లేకపోవడమే కారణంగా కనిపిస్తోంది.ప్రస్తుత పరిస్ధితుల్ని చూస్తుంటే ఎన్డీయే ఎలక్ట్రోరల్ కాలేజీలో సాధారణ మెజారిటీకి కేవలం 13వేల ఓట్ల దూరంలోనే ఉంది. అలాగే వైసీపీ, టీడీపీ, బీజేడీ, అన్నాడీఎంకే వంటి పార్టీలు బీజేపీకే మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి. దీంతో తెలిసి తెలిసి బరిలోకి దిగి ఓటమిపాలవ్వడం ఎందుకనే భావనలో పవార్ ఉన్నట్లు తెలుస్తోంది.
- Telangana: సీఎం కేసీఆర్ లెక్క ఇదే.. వారిని మంత్రి పదవి వరించేనా?
- AP : బద్వేల్ ఉప ఎన్నిక..నోటిఫికేషన్
- Regional Transport Office : డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలు..తెలుసుకోవాల్సిన విషయాలు
- Andhra Pradesh : పరిషత్ ఎన్నికల పోలింగ్, ఫలితాలు అప్పుడే వెల్లడించరు
- Tirupati by Poll : తిరుపతి ఉప ఎన్నిక, గెలుపు ఎవరిది..అభ్యర్థుల నామినేషన్ల దాఖలు
1Amitabh Bachchan : హైదరాబాద్ మెట్రోలో అమితాబ్.. ప్రాజెక్టు K షూటింగ్..
2BJP vs TRS : బీజేపీ కి షాక్…కారు ఎక్కిన కమలం కార్పోరేటర్లు
3Pavitra Lokesh : సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటి..
4RBI On Cryptocurrencies : ముప్పు తప్పదు.. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ వార్నింగ్
5Mumbai: ఫోన్ పక్కకుపెట్టి జాబ్ వెదుక్కోమని చెప్పిందని వదిన హత్య
6Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
7Pat Cummins Sixer : ఇదేందయ్యా ఇది.. ఏడా సూడలే.. భారీ సిక్సర్ బాదిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
8Sandwich Shot Dead : బాబోయ్.. శాండ్ విచ్లో క్రీమ్ ఎక్కువగా ఉందని కాల్చి చంపేశాడు
9Pooja Hegde: పూజా కొంటె అందాలు చూడతరమా..?
10Indian Railways: రైల్లో కప్పు కాఫీకి రూ.70 చెల్లించిన ప్రయాణికుడు
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!