International Yoga Day: దేశంలోని 75ప్రదేశాల్లో యోగా చేయనున్న 75మంది మంత్రులు 

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశంలోని 75 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 75 మంది మంత్రులు యోగాను ప్రదర్శించనున్నారు.

International Yoga Day: దేశంలోని 75ప్రదేశాల్లో యోగా చేయనున్న 75మంది మంత్రులు 

Yoga Mahotsav (1)

International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశంలోని 75 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 75 మంది మంత్రులు యోగాను ప్రదర్శించనున్నారు.

జూన్ 21న జరుపుకోనున్న ఎనిమిదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్‌లో యోగా చేయనుండగా, ఆయన మంత్రివర్గంలోని 75 మంది మంత్రులు దేశంలోని 75 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాల్లో యోగా చేయనున్నారు.

దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌”కు గుర్తుగా 75 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలలో యోగా కార్యక్రమాలలో పాల్గొనేందుకు 75 మంది మంత్రులను నియమించారని తెలియజేశారు.

యోగా దినోత్సవం రోజున మహారాష్ట్రలోని నాసిక్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ త్రయంబకేశ్వర్ ఆలయ సముదాయంలో జరిగే యోగా కార్యక్రమాలలో హోంమంత్రి అమిత్ షా, తమిళనాడులోని కోయంబత్తూరులో యోగా దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు.

Read Also: ఇరవై నాలుగు వేల అడుగుల ఎత్తులో యోగా.. ఐటీబీపీ సరికొత్త రికార్డు

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఢిల్లీలోని లోటస్ టెంపుల్‌లో యోగా చేయనున్నారు.
నాగ్‌పూర్‌లోని జీరో మైల్ స్టోన్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ యోగా చేయనున్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యోగా చేయనున్నారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా ఫోర్ట్‌లో యోగా చేయనున్నారు.
సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోని నలాగర్ ప్యాలెస్‌లో యోగాలో పాల్గొంటారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లక్నోలోని లక్నో రెసిడెన్సీలో యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.
కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పాల్గొంటారు.
మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ యోగా చేయనున్నారు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో మంత్రి అర్జున్ ముండా యోగా చేయనున్నారు.
ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ యోగా చేయనున్నారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కర్ణాటకలోని హంపిలో మాన్యుమెంట్స్ సమూహంలో యోగా చేయనున్నారు.
మహారాష్ట్రలోని పూణెలోని పూణె మెట్రో స్టేషన్‌లో కేంద్ర మంత్రి నారాయణ్ రాణే యోగా చేయనున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఫతేపూర్ సిక్రీ కోటలో కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నిర్వహిస్తారు.
మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది మూలమైన అమర్‌కంటక్‌లో కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ యోగా చేయనున్నారు.
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని గ్వాలియర్ కోటలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా యోగాలో పాల్గొంటారు.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని హర్ కీ పౌరిలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ యోగా చేయనున్నారు.
బీహార్‌లోని ప్రసిద్ధ నలంద మహావిహారంలో కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ యోగాలో పాల్గొంటారు.
గుజరాత్‌లోని కెవాడియాలోని ప్రసిద్ధ సర్దార్ పటేల్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా యోగా చేయనున్నారు.
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సామ్ సాండ్ డ్యూన్స్‌లో యోగాలో పాల్గొంటారు.
కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలంగాణలోని ఆనంద్ సాగర్ లేక్ సైట్‌లో యోగా చేయనున్నారు.
హిమాచల్‌లోని నలాగర్ కోట వద్ద కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.
బీహార్‌లోని గయాలోని ప్రసిద్ధ మహాబోధి ఆలయంలో కేంద్ర మంత్రి ఆర్‌సిపి సింగ్ యోగా చేయనున్నారు.
ఒడిశాలోని పూరీలోని ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయ సముదాయంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ యోగా చేయనున్నారు.
కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలోని ప్రసిద్ధ చారిత్రక హరప్పా నాగరికత ప్రదేశం ధోలవీరాలో యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.
ఢిల్లీలోని ఎర్రకోటలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రాచీన భారతీయ యోగా సాధన ప్రయోజనాలను గుర్తిస్తూ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.