Maharashtra: మహారాష్ట్ర నూతన గవర్నర్‭గా అమరీందర్ సింగ్!

కెప్టెన్ అమరీందర్ సింగ్ 2021 నవంబర్‌లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి స్థానంలో నుంచి తనను తప్పించి చరణ్ జిత్ సింగ్ ను నియమించడం పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన పార్టీని వీడారు. అనంతరం సొంతంగా 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పార్టీని స్థాపించి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. కాగా, గత సెప్టెంబర్‌లో తన పార్టీని ఆయన బీజేపీలో విలీనం చేశారు.

Maharashtra: మహారాష్ట్ర నూతన గవర్నర్‭గా అమరీందర్ సింగ్!

Is Amarinder Singh as the new governor of Maharashtra?

Maharashtra: మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ తన పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థానాన్ని కెప్టెన్ అమరీందర్‌తో భర్తీ చేయాలని కమల పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కెప్టెన్ అమరీందర్ సింగ్ 2021 నవంబర్‌లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి స్థానంలో నుంచి తనను తప్పించి చరణ్ జిత్ సింగ్ ను నియమించడం పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన పార్టీని వీడారు. అనంతరం సొంతంగా ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పార్టీని స్థాపించి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. కాగా, గత సెప్టెంబర్‌లో తన పార్టీని ఆయన బీజేపీలో విలీనం చేశారు.

Surgical Strike: సర్జికల్ స్ట్రైక్స్ నిజంగా చేసుంటే, వీడియో రిలీజ్ చేయండి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

వరుస కాంట్రవర్సీల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్లు కోశ్యారీ ప్రకటించడం గమనార్హం. సోమవారం రాజ్ భవన్ నుంచి వెలువడిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముంబై పర్యటనకు వచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. 2019 నుంచి మహారాష్ట్ర గవర్నర్‭గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన.. అనేక రాజకీయ కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి మేలు చేసే విధంగా ప్రవర్తించారని, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా బాగానే ఉన్నాయి.

Pariksha Pe Charcha: విమర్శల గురించి అడగ్గా.. అది సబ్జెక్టు కాదని చెప్పిన ప్రధాని మోదీ

బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్‭లో కోశ్యారి సీనియర్ నేత. ఆయన హయాంలో అనేక కాంట్రవర్సీలు జరిగాయి. కొన్నింటికి ఆయనే కేంద్ర బిందువుగా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఈయన పదవీ కాలంలో అతిపెద్ద కాంట్రవర్సీ. ఇక ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘ఉద్ధవ్‭ను సెక్యూలర్ ఎప్పుడు అయ్యావంటూ’ లేఖ రాయడం రాజకీయ విమర్శలకు దారి తీసింది.