Transgender Community: పాటలు పాడక్కర్లేదు, డాన్స్ చేయక్కర్లేదు.. ఇక నుంచి ట్రాన్స్‌జెండర్లు గౌరవంగా ఉద్యోగం చేసుకుని బతకొచ్చు

తమ పిల్లలను విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని తన కమ్యూనిటీకి రవీనా మహంత్ పిలుపునిచ్చారు. డాన్స్ చేయడం, పాటలు పాడటమే తమ జీవనాధారమైన కాలం పోయి కాకుండా ఇతరుల సంతోషంలో పాలుపంచుకునే ఏదో ఒక రోజు వస్తుందని అన్నారు

Transgender Community: పాటలు పాడక్కర్లేదు, డాన్స్ చేయక్కర్లేదు.. ఇక నుంచి ట్రాన్స్‌జెండర్లు గౌరవంగా ఉద్యోగం చేసుకుని బతకొచ్చు

Updated On : October 14, 2023 / 5:11 PM IST

Jammu and Kashmir: ఎవరింట్లో అయినా ట్రాన్స్‌జెండర్లు పుడితే ఏ తల్లిదండ్రులూ ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంలో ఒక కొడుకో లేదంటే కూతురో తల్లిదండ్రులకు ఆసరాగా మారినట్లు, ఇప్పుడు ట్రాన్స్‌జెండర్లు కూడా ఎదిగి తన కుటుంబానికి జీవనోపాధిగా మారవచ్చు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు  అవకాశాన్ని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి కూడా కల్పించింది. దీంతో చదువుకున్న ట్రాన్స్‌జెండర్లు ఇక ముందు ప్రభుత్వ కార్యాలయాల్లో గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకోవచ్చు.

ఈ విషయమై ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన రవీనా మహంత్ మాట్లాడుతూ ‘‘సమాజంలో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. అందరిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ ఈ సమాజంలో నివసిస్తున్న ట్రాన్స్‌జెండర్ సమాజానికి, వారి పనికి గౌరవం లేదు. ఇకపై ఈ పరిస్థితి ఉండదు. ఇక్కడి ట్రాన్స్‌జెండర్ వర్గాన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులుగా చేసి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మార్గం చూపింది’’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: Caste Census: కులగణనపై రాహుల్ గాంధీని తప్పుపట్టిన రవిశంకర్.. ఇందిరా నుంచి నేర్చుకోవాలంటూ చురక

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ పిల్లలను విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని తన కమ్యూనిటీకి రవీనా మహంత్ పిలుపునిచ్చారు. డాన్స్ చేయడం, పాటలు పాడటమే తమ జీవనాధారమైన కాలం పోయి కాకుండా ఇతరుల సంతోషంలో పాలుపంచుకునే ఏదో ఒక రోజు వస్తుందని అన్నారు. వివిధ రంగాలలో డిగ్రీలు పొందడం ద్వారా డాక్టర్లు, ఇంజనీర్లు అవుతూ దేశ పురోగతికి తమ పూర్తి సహకారం అందిస్తామని మహంత్ అన్నారు.