Jharkhand Trikoot Ropeway : త్రికూట పర్వతంపై ఢీకొన్న కేబుల్ కార్లు..ముగ్గురు మృతి..20 గంటలుగా ఇబ్బంది పడుతున్న భక్తులు

ఝార్ఖండ్ లోని త్రికూట పర్వతాల్లో రోప్ వే ప్రమాదం సంభవించింది.  త్రికూట్ పర్వతంపై రెండు కేబుల్ కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వైర్లు తెగిపోగా ముగ్గురు యాత్రీకులు మృతి.

Jharkhand Trikoot Ropeway : త్రికూట పర్వతంపై ఢీకొన్న కేబుల్ కార్లు..ముగ్గురు మృతి..20 గంటలుగా ఇబ్బంది పడుతున్న భక్తులు

Jharkhand Trikoot Ropeway

Jharkhand Trikoot Ropeway : ఝార్ఖండ్ లోని త్రికూట పర్వతాల్లో రోప్ వే ప్రమాదం సంభవించింది. ఆదివారం (ఏప్రిల్ 10,2022)శ్రీరామనవమి పండుగ సందర్భంగా యాత్రికులు బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు కొలువైన త్రికూట్ పర్వతంపై రెండు కేబుల్ కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వైర్లు తెగిపోగా ముగ్గురు యాత్రీకులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది.50మంది ప్రయాణీకులు ఈ ప్రమాదంలో చిక్కుకోగా ముగ్గురు చనిపోయారు. యాత్రీకులు దాదాపు 20 గంటలకుపైగా గాల్లోనే చిక్కుకుపోయారు.

శ్రీరామ నవమి సందర్భంగా యాత్రీకులు బైద్యనాథ్ ఆలయ సందర్శన కోసం వివిధ ప్రాంతాల నుంచి 50 మందికిపైగా యాత్రికులు రోప్ వే మార్గంలో బయల్దేరారు. ఈక్రమంలో సాంకేతిక కారణాలతో ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. ఆకాశంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతోంది. వైమానిక దళం సాయం చేస్తోంది.

ఎం 17 హెలికాప్టర్లు రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయి. యాత్రీకులను సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, ఈ త్రికూట్ రోప్ వే భారత్ లోనే ఎత్తైన రోప్ వే. 766 మీటర్ల పొడవుంటుంది. 25 క్యాబిన్లతో ప్రయాణాలు చేస్తుంటారు. ఒక్కో దాంట్లో నలుగురు ప్రయాణించేందుకు వీలుంటుంది.

కాగా..త్రికూట్ పర్వత సందర్శనకు జార్ఖండ్ నుంచే కాకుండా బెంగాల్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల నుంచి కూడా యాత్రీకులు తరలి వస్తుంటారు. ఈ త్రికూట్ పర్వతాలపైకి వెళ్లటానికి సరైన మార్గం లేకపోవటంతో రోప్ వేను ఉపయోగిస్తారు. ఈక్రమంలో శ్రీరామ నవమి సందర్భంగా భక్తులు త్రికూట్ పర్వతానికి పోటెత్తారు. ఈక్రమంలో రోప్ వే వైర్లు తెగిపోవటంతో మరోదారి లేక త్రికూట్ కొండల్లోనే చిక్కుకుపోయారు. దీనిపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, రెస్క్యూటీమ్ ఆపరేషన్ చేపట్టింది. వీరికి తోడు ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది.హెలికాప్టర్ సహాయంతో యాత్రీకులను రక్షించేందుకు యత్నిస్తున్నారు.