Operation Mask in prison : 3 రోజుల్లో 7 వేల మాస్కులు తయారు చేసి రికార్డు సృష్టించిన ఖైదీలు

Operation Mask in prison : 3 రోజుల్లో 7 వేల మాస్కులు తయారు చేసి రికార్డు సృష్టించిన ఖైదీలు

3 Days Prisoners Made 7 Thousand Masks

3 days prisoners made 7 thousand masks : భారతదేశమే కాదు మొత్తం కరోనాతో యుద్ధం చేస్తోంది. కంటికి కనిపించని మహమ్మారితో యుద్దం చేస్తూనే ఉంది. మాస్కులు తప్పనిసరి అయ్యాయి. మాస్కు లేకపోతే చాలు జరిమాలు వేస్తున్న పరిస్థితి పోవటంలేదు. దీనికి కారణం కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండటమే. ఈ మహమ్మారిపై పోరులో మాస్కులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దీంతో మీటర్ జైలులో ఆపరేషన్ మాస్క్ తయారీ కొనసాగుతోంది.

ఈ క్రమంలో కారాగారంలో ఉండి కూడా కరోనాపై పోరు సాగిస్తున్నారు ఖైదీలు. మాస్కుల తయారీలో రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు మీరఠ్ జిల్లా కారాగారంలో ఉంటున్న ఖైదీలు. మాస్కులు తయారు చేయటంతో సరికొత్త రికార్డు సృష్టించారు మీరఠ్ జైలు ఖైదీలు. కేవలం మూడంటే మూడు రోజుల్లో ఏకంగా 7వేల మాస్కులు తయారు చేసి..కొత్త రికార్డు సృష్టించారు. మాస్కుల తయారీ పనిలో మొత్తం 40 మంది ఖైదీలు పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా జైలు అధికారి పాండే మాట్లాడుతూ.. జైలులో మాస్క్‌లను యుద్ధ ప్రాతిపదికన తయారు చేస్తున్నామనీ..15 నుంచి 15 వేల మాస్కులు తయారు చేసి రిజర్వులో ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. ప్యూర్ కాటన్‌తో తయారు చేసిన ఈ మాస్కులో మూడు లేయర్లు ఉంటాయని వివరించారు.

అలాగే ఈ మాస్కులను శానిటైజ్ చేసి..ప్యాక్ చేస్తున్నామని తెలిపారు. ఒక్కో ఖైదీ రోజుకు 125 మాస్కులు వరకూ తయారు చేస్తున్నారనీ..ఒక్కో మాస్క్ తయారీకి ఒక రూపాయికి ఇస్తామని తెలిపారు. మాస్కుల తయారీలో కొంతమంది ఖైదీలు కాటన్ వస్త్రాన్ని కట్ చేసి ఇస్తే మరికొంతమంది ఖైదీలు మిషన్లపై మాస్క్‌లను కుడతారని తెలిపారు. ఒక మాస్క్ తయారీకి ఎనిమిది రూపాయల వరకూ ఖర్చవుతుందని..కానీ తాము ఒక్కో మాస్కు రూపాయికే ఇస్తున్నామని తెలిపారు.