బెగుసరాయ్ నుంచి లోక్ సభ బరిలో కన్హయ్య

  • Published By: venkaiahnaidu ,Published On : March 24, 2019 / 09:46 AM IST
బెగుసరాయ్ నుంచి లోక్ సభ బరిలో కన్హయ్య

Kanhaiya Kumar

మరికొన్ని రోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్దమయ్యారు.ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థిసంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్.బీహార్ లోని బెగుసరాయ్ లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ అభ్య‌ర్థిగా క‌న్న‌య్య‌ బ‌రిలో దిగుతున్నారు. అయితే ముందుగా రాష్ట్రంలోని ప్రధాన మిత్రపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, ఆర్జేడీలు ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్తిగా కన్నయ్యకు మద్దతు తెలిపాయి. అయితే పొత్తులో భాగంగా ఆ సీటును ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్‌ కు కేటాయించారు. దీంతో సీపీఐ త‌ర‌ఫున క‌న్న‌య్య పోటీకి దిగుతున్నారు. 

బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా కొన్ని సీట్లలో మాత్రమే పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు వామపక్ష పార్టీలు తెలిపాయి.మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్‌ ప్రధాన పార్టీలుగా ఉన్న మహాకూటమిపై వామపక్షాలు మండిపడ్డాయి.మహాకూటమిలో తమకు సీట్లను కేటాయించకుండా కొన్ని పార్టీలతో మాత్రమే పొత్తుపెట్టుకోవడంపై వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

బిహార్‌లో మహాకూటమిలోని పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆర్జేడీ-20, కాంగ్రెస్‌ -9, ఆర్‌ ఎల్‌ ఎస్‌ పీ-5, హిందుస్థానీ హెచ్‌ ఏఎం-3, వికాసశీల్‌ ఇన్సాన్‌ పార్టీ-3 స్థానాల్లో పోటీ చేయనున్న విష‌యం తెలిసిందే. 2014 ఎన్నికల్లో బెగూసరాయ్ లో  నియోజవర్గంలో బీజేపీ అభ్యర్థి భోలా సింగ్‌  విజయం సాధించారు.