Triple Talaq : భార్య కనుబొమలు షేప్ చేయించుకుందని…సౌదీలో ఉన్న భర్త షాక్ ఇచ్చాడు

భార్య బ్యూటీపార్లర్‌కు వెళ్లి తన కనుబొమలు షేప్ చేయించుకుందనే కోపంతో భర్త ఫోనులోనే ట్రిపుల్ తలాఖ్ చెప్పిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో సంచలనం రేపింది....

Triple Talaq : భార్య కనుబొమలు షేప్ చేయించుకుందని…సౌదీలో ఉన్న భర్త షాక్ ఇచ్చాడు

Kanpur woman

Updated On : November 1, 2023 / 6:01 AM IST

triple talaq : భార్య బ్యూటీపార్లర్‌కు వెళ్లి తన కనుబొమలు షేప్ చేయించుకుందనే కోపంతో భర్త ఫోనులోనే ట్రిపుల్ తలాఖ్ చెప్పిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో సంచలనం రేపింది. ట్రిపుల్ తలాఖ్ ను కేంద్రం నిషేధించినా సౌదీలో ఉన్న భర్త ఇలా ఫోనులోనే ట్రిపుల్ తలాఖ్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కాన్పూర్ నగరానికి చెందిన గుల్సైబా అనే మహిళ 2022 జనవరి నెలలో సలీమ్‌ను వివాహం చేసుకుంది.

Also Read : Chandrababu Thanks : మీరు చూపిన అభిమానం నా జీవితంలో మర్చిపోను- చంద్రబాబు

సలీం సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. తన భర్త ఈ ఏడాది ఆగస్టు 30వతేదీన సౌదీఅరేబియా వెళ్లాక తన అత్తమామలు కట్నం కోసం తనను వేధించడం ప్రారంభించారని గుల్సైబా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను బ్యూటీపార్లర్ లో తన కనుబొమల ఆకృతిని చేయించుకున్నానని ఆమె చెప్పారు. అక్టోబర్ 4వతేదీన తన భర్త సలీం సౌదీ అరేబియా దేశం నుంచి వీడియోకాల్ చేశాడని, ఆ సమయంలో తన కనుబొమల షేప్ చూసి ప్రశ్నించాడని భార్య గుల్సైబా చెప్పారు.

Also Read : Rahul Gandhi : సీఎం కేసీఆర్‌పై ఎందుకు కేసులు, దాడులు లేవు? రాహుల్ గాంధీ

తాను వికృతంగా కనిపిస్తున్నానని షేప్ చేయించుకున్నానని వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా తనకు మూడు సార్లు తలాఖ్ అంటూ ఫోన్ లోనే ట్రిపుల్ తలాఖ్ చెప్పి డిస్ కనెక్ట్ చేశాడని భార్య చెప్పారు. తాను మళ్లీ ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గుల్సైబా ఫిర్యాదు మేరకు ఆమె భర్తతో పాటు ఆమె అత్తగారు మరో ఐదుగురిపై కాన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read : Revanth Reddy : మళ్లీ సీఎంని చేస్తే మరో లక్ష కోట్లు దోచుకుంటారు, రాష్ట్రాన్ని కొల్లగొడతారు- సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

‘‘నాకు పెళ్లయి ఏడాది మాత్రమే అయింది. గతంలో నన్ను అగౌరవపరిచిన నా భర్త ఇప్పుడు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. అతనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని గుల్సైబా పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.