Karnataka : ఒకేసారి 21 మంది ప్రభుత్వ అధికారుల నివాసాలపై ఏసీబీ దాడులు..భారీగా నగలు..నగదు స్వాధీనం
కర్ణాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈక్రమంలో కర్ణాటక ప్రభుత్వం అధికారులపై కొరడా ఝళిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు చేపట్టింది. ఒకేసారి ఒకరు కాదు ఇద్దరు కాదు 21మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా నగదు,నగలు విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

ACB raids in 80 locations against 21 Karnataka govt officials : కర్ణాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈక్రమంలో కర్ణాటక ప్రభుత్వం అధికారులపై కొరడా ఝళిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు చేపట్టింది. ఒకేసారి ఒకరు కాదు ఇద్దరు కాదు 21మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా నగదు,నగలు విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తులు కలిగిఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది ప్రభుత్వ అధికారుల నివాసాలపై అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 80 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో300 మంది అధికారులు పాల్గొన్నారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ముదుగల్ పోలీస్ ఇన్ స్పెక్టర్ ఉదయ్ రవి తల్లిదండ్రుల ఇంట్లో భారీగా, నగదు,నగలు స్వాధీనం చేసుకున్నారు.అదే సమయంలో ఉడిపిలో చిన్న నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ హరీష్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అతని ఇంట్లో భారీగా నగలు లభ్యమయ్యాయి. 2 కేజీలకు పైగా బంగారం, దాదాపు రూ.5 లక్షల నగదు..ఖరీదైన వాచీలు, మూడు వాహనాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. బంగారంలో ప్లేట్లు..ట్రేలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 15కు పైగా బంగారు కంకణాలు, 30 నెక్లెస్‌లు, గొలుసులు, కంకణాలు, అమ్మవారి విగ్రహాలు లభ్యమయ్యాయి. వస్తువులు, సంబంధిత పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం రాకపోవడంతో కాంగ్రెస్, మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే కూటమిలో చీలిక రావడంతో ఏడాది కాలంలోనే ఆ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం యెడియూరప్ప సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే అవినీతి ఆరోపణలు రావడంతో బీజేపీ అధినాయకత్వం ఆయనను పదవినుంచి తొలగించి బస్వరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేసిన విషయం తెలిసిందే.
- Karnataka Crime : హత్యాచార కేసును ఛేదించి..నిందితుడిని పట్టించిన కుక్క
- State Bank Of India : ఎస్బీఐలో నగదు అవకతవకలు- రూ.5 కోట్లు కాజేసిన క్యాషియర్ ?
- Cat Receiving Royalties : పిల్లికి రాచమర్యాదలు చేస్తున్న పోలీసులు
- Embryos Found: డ్రైనేజీలో ఏడు పిండాలు లభ్యం
- Karnataka Leader: ప్రిన్సిపాల్‌ను చెంపదెబ్బ కొట్టిన కర్ణాటక లీడర్
1NBK 107 : బాలకృష్ణతో అల్లరి చేస్తున్న నరేష్..
2Kishore Das : క్యాన్సర్‌తో యువ హీరో మృతి..
3Nani : ‘అంటే సుందరానికి’ వచ్చేస్తున్నాడు ఓటీటీలోకి..
4IndiavsEngland: మ్యాచ్‌పై పట్టు బిగిస్తున్న భారత్.. 250 దాటిన ఆధిక్యం
5Jasprit Bumrah Stunning Catch : వావ్.. ఎక్స్లెంట్.. స్టన్నింగ్ క్యాచ్ పట్టిన బుమ్రా.. వీడియో వైరల్
6Money Plant: మనీ ప్లాంట్ పెంపకంపై వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది
7Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
8Pakistan Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. 19మంది మృతి
9Telangana: 10 సభలు పెట్టినా బీజేపీని ఎవరూ నమ్మరు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
10Rains In Telangana : రాగల 24 గంటల్లో అల్పపీడనం-తెలంగాణలో పలు జిల్లాలలో వర్షాలు
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు