Viral News: ఐ‌ఫోన్‌తో కేక్‌కట్ చేసిన కుమారుడు.. వెనకేసుకొచ్చిన ఎమ్మెల్యే!

ఆయన అదో రేంజ్.. ఎంతైనా ఎమ్మెల్యే కొడుకు కదా.. తన స్థాయి ఏంటో చూపించాలని పుట్టినరోజున ఏకంగా ఐ ఫోన్ తో కేక్ కట్ చేశాడు. ఇది కాస్త వైరల్ గా మారడంతో తండ్రి ఎమ్మెల్యే వరకు చేరింది.

Viral News: ఐ‌ఫోన్‌తో కేక్‌కట్ చేసిన కుమారుడు.. వెనకేసుకొచ్చిన ఎమ్మెల్యే!

Viral News

Viral News: ఆయన అదో రేంజ్.. ఎంతైనా ఎమ్మెల్యే కొడుకు కదా.. తన స్థాయి ఏంటో చూపించాలని పుట్టినరోజున ఏకంగా ఐ ఫోన్ తో కేక్ కట్ చేశాడు. ఇది కాస్త వైరల్ గా మారడంతో తండ్రి ఎమ్మెల్యే వరకు చేరింది. మరి తండ్రి మాత్రం తక్కువ తిన్నాడా.. ప్రస్తుతం కరోనా కాలం కదా అందుకే చేత్తో కాకుండా ఫోన్ తో కట్ చేశాడని కవర్ చేశాడు. కర్ణాటక రాష్ట్రంలోని కనకగిరి ఎమ్మెల్యే బసవరాజ్ కుమారుడు సురేష్ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాడు.

ఈ పుట్టినరోజు వేడుకలు కాస్త వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా ఐ ఫోన్ తో కేక్ కట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బళ్లారి జిల్లా హొస్పెట్ లో జరిగిన ఈ వేడుకలు ఇప్పుడు ఆ రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లగ్జరీ కార్లలో దిగిన సురేష్ అతని ఫ్రెండ్స్ ఘనంగా ఈ వేడుకలు నిర్వహించారు.

ఈ పుట్టినరోజు వేడుకలో మొత్తం 8 కేకులను ఐ ఫోన్ తో కట్ చేసినట్లు ఈ వీడియోలో కనిపిస్తుండగా వీడియో కాస్త వైరల్ కావడంతో తండ్రి ఎమ్మెల్యే స్పందించి వివాదాస్పదంగానే జవాబిచ్చారు. ప్రస్తుతం కరోనా కాలం కనుక చేతులకు బదులు ఐఫోన్ ఉపయోగించాడని.. అదేమీ పెద్ద తప్పు కాదన్నారు. దీంతో ఎమ్మెల్యే కామెంట్స్ కూడా మరింత వైరల్ అవుతున్నాయి.