Karnataka: 205 కేజీల ఉల్లిపాయల్ని 8 రూపాయలకే అమ్మిన రైతు.. వైరల్ అవుతున్న రశీదు

205 కేజీల ఉల్లిపాయల్ని మార్కెట్లో విక్రయించిన రైతు చేతికొచ్చింది రూ.8.36 మాత్రమే. దీనికి సంబంధించిన రశీదు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది రైతు దుస్థితికి నిదర్శనమని నెటిజన్లు అంటున్నారు.

Karnataka: 205 కేజీల ఉల్లిపాయల్ని 8 రూపాయలకే అమ్మిన రైతు.. వైరల్ అవుతున్న రశీదు

Karnataka: దేశంలో రైతులు పడుతున్న ఇబ్బందులకు నిదర్శనం ఈ ఘటన. ఒక రైతు తన పొలంలో పండించిన 205 కేజీల ఉల్లిపాయల్ని ఎనిమిది రూపాయలకే అమ్ముకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన రశీదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Bihar: తెల్లారేసరికి మాయమైన రెండు కిలోమీటర్ల రోడ్డు.. గ్రామస్తుల ఆశ్చర్యం.. అసలేం జరిగింది?

కర్ణాటక గదగ్ జిల్లాలో ఒక రైతు ఇటీవల మార్కెట్ యార్డులో 205 కేజీల ఉల్లిపాయల్ని విక్రయించాడు. అయితే, అంత మొత్తానికిగాను అతడికి వచ్చింది రూ.8.36 మాత్రమే. హమాలీ ఛార్జీలు, కమిషన్ వంటివి అన్నీ పోను ఆ రైతుకు మిగిలింది అంతే. ఈ విక్రయానికి సంబంధించిన రశీదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రైతు దుస్థితికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. ఇది వైరల్ కావడంతో ఇలాంటి అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది రైతులు తాము కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నామని చెబుతున్నారు. ఎంతోమంది రైతులు ఉల్లిపాయల్ని విక్రయిస్తూ రూ.10 కంటే తక్కువ ఆదాయం పొందుతున్నట్లు చెప్పారు.

Islamic State: ఐసీసీ చీఫ్ అబూ హసన్ అల్ ఖురేషీ హతం.. కొత్త చీఫ్‌గా అబూ అల్ హుస్సేన్ అల్ హుస్సేని అల్ ఖురేషి

కర్ణాటకలో ఎక్కువ మంది రైతులు బెంగళూరు పరిధిలో ఉన్న యెశ్వంత్ పూర్ మార్కెట్‌కు వచ్చి తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తుంటారు. కొందరు రైతులు గదంగ్ జిల్లా నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణించి పంట అమ్ముకుంటే వారికి మిగిలేది చాలా తక్కువే. అసలు ధర బాగానే ఉన్నప్పటికీ, రవాణా ఛార్జీలు, హమాలీ ఛార్జీలు, కమిషన్ వంటివన్నీ పోను తమకు పది రూపాయలు కూడా రావడం లేదని చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.