Karnataka: పేరెంట్స్ నుంచి రూ.100 వసూలు నిర్ణయంపై వెనక్కి తగ్గిన సర్కారు.. ఆదేశాలు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

స్కూలు డెవలప్‌మెంట్ పేరిట పేరెంట్స్ నుంచి ప్రతి నెలా రూ.100 వసూలు చేయాలన్న నిర్ణయాన్ని కర్టాటక సర్కారు వెనక్కి తీసుకుంది. జీవో జారీ చేసిన నాలుగు రోజుల్లోనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

Karnataka: పేరెంట్స్ నుంచి రూ.100 వసూలు నిర్ణయంపై వెనక్కి తగ్గిన సర్కారు.. ఆదేశాలు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

Karnataka: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పేరిట పేరెంట్స్ నుంచి ప్రతి నెలా రూ.100 వసూలు చేయాలన్న నిర్ణయంపై కర్ణాటక సర్కారు వెనక్కి తగ్గింది. ఈ ఆదేశాలు జారీ చేసిన నాలుగు రోజుల్లోనే ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కు తీసుకుంది.

Jewellery Showroom: నగల షోరూమ్ ఓనర్‌ను బంధించి మూడు కేజీల బంగారం ఎత్తుకెళ్లిన ఉద్యోగులు

ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో అభివృద్ధి పనుల కోసం ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి నెలనెలా రూ.100 వసూలు చేయాలని ఆదేశిస్తూ ఈ నెల 20న కర్ణాటక విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయంపై ప్రజల నుంచి, ఇతర పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్, జేడీఎస్ సహా అన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం దివాళా తీసిందని, అందుకే నిస్సిగ్గుగా విద్యార్థుల దగ్గరి నుంచి డబ్బు వసూలు చేస్తోందని జేడీఎస్ విమర్శించింది.

ఇప్పటికే ప్రభుత్వ పనుల కోసం 40 శాతం కమీషన్ వసూలు చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు పేద విద్యార్థుల్ని దోచుకోవాలనుకుంటోందని కాంగ్రెస్ విమర్శించింది. ఇలా అన్ని పక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది. ఈ నెల 20న జారీ చేసిన సర్క్యులర్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.