Invitation To Army: మా పెళ్లికి రండి.. ఇండియన్ ఆర్మీకి ఆహ్వానపత్రిక పంపించిన కేరళ జంట.. ఆర్మీ నుంచి అద్భుత రెస్పాన్స్.. సంతోషంలో వధూవరుడు

వివాహ ఆహ్వానం పంపించిన రాహుల్, కార్తీకలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చాలా సంతోషకరమైన, ఆనందకరమైన వివాహ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇండియన్ ఆర్మీ పోస్టు చేసింది.

Invitation To Army: మా పెళ్లికి రండి.. ఇండియన్ ఆర్మీకి ఆహ్వానపత్రిక పంపించిన కేరళ జంట.. ఆర్మీ నుంచి అద్భుత రెస్పాన్స్.. సంతోషంలో వధూవరుడు

Invitation To Army

Invitation To Army: కేరళ రాష్ట్రంకు చెందిన ఓ పెండ్లి జంట తమ వివాహానికి రావాలంటూ ఇండియన్ ఆర్మీకి ఆహ్వాన పత్రికను అందించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వారి స్వహస్తాలతో రాసిన లేఖను ఆర్మీకి పంపించింది. దీనికి ప్రతిగా ఆర్మీ నుంచి వారికి బెస్ట్ విషెస్ అందడంతో ఆ జంట ఆనందానికి హద్దులులేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెండ్లి జంట వినూత్న ఆలోచనను, అందుకు ప్రతిగా ఇండియన్ ఆర్మీ స్పందించిన తీరును నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Indian Army : బ్రిటీష్ కాలం నాటి పేర్ల‌ను, యూనిఫామ్‌ల‌ను మార్చేయాలని నిర్ణయించిన ఇండియన్ ఆర్మీ

కేరళకు చెందిన రాహుల్, కార్తీక దంపతులు నవంబర్ 10న వివాహం చేసుకున్నారు. వీరు తమ ఆహ్వాన పత్రికను చేతితో రాసి ఒక నోట్ తో పాటు భారత సైన్యానికి పంపారు. ఈ నోట్ .. మేము (రాహుల్, కార్తీక) నవంబర్ 10న పెళ్లి చేసుకోబోతున్నాం. దేశం పట్ల మీ ప్రేమ, దృఢసంకల్పం, నిజమైన దేశభక్తికి మేము నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మమ్మల్ని సురక్షితంగా కాపాడుతున్నందుకు మీకు రుణపడి ఉంటాము. మీ వల్ల మేము ప్రశాంతంగా నిద్రపోతున్నాము. మా ప్రియమైన వారితో మాకు సంతోషకరమైన రోజులను అందించినందుకు ధన్యవాదాలు. మీ కారణంగా మేము సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నాము. మేము మా ప్రత్యేక రోజున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నాము.  అంటూ రాశారు.

 

View this post on Instagram

 

A post shared by Indian Army (@indianarmy.adgpi)

ఇండియన్ ఆర్మీ నూతన జంటకు ‘బెస్ట్ విషెస్’ చెప్పింది. వివాహ ఆహ్వానం పంపించిన రాహుల్, కార్తీకలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చాలా సంతోషకరమైన, ఆనందకరమైన వివాహ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్మీ పోస్టు చేసింది. ఈ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. 90వేల మందికిపైగా నెటిజన్లు వీక్షించారు. మన నిజమైన హీరోల పట్ల మన హృదయాలలో ఉన్న ప్రేమను వ్యక్తపరచడం ఉత్తమం అని ఓ నెటిజన్ రాయగా, ‘వావ్, ఇది అత్యుత్తమ వివాహ ఆహ్వానం. మన నిజమైన హీరోలకు జై హింద్’ అని ఇంకొకరు పేర్కొన్నారు. మరో నెటిజన్ “ఇది అద్భుతం!” అంటూ రాశారు. మరోవైపు వివాహ బంధంతో ఒక్కటైన జంటకు ఆర్మీనుంచి విషెస్ రావడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.