World Highest Theatre : లఢక్ లో సినిమా థియేట‌ర్‌

ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే సినిమా థియేట‌ర్‌ను మన భారత్ లోనే నిర్మించారు ల‌ఢ‌క్‌లో. అక్క‌డి రిమోట్ ప్రాంతాల్లో ఉండే ప్ర‌జ‌ల‌ కోసం సినిమా థియేట‌ర్ నిర్మించారు.

World Highest  Theatre : లఢక్ లో సినిమా థియేట‌ర్‌

World's Highest Movie Theatre

World’s Highest Movie Theatre : ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే సినిమా థియేట‌ర్‌ను మన భారత్ లోనే నిర్మించారు. ఎక్క‌డో తెలుసా? చల్ల చల్లని అందాల ల‌ఢ‌క్‌లో. అక్క‌డి రిమోట్ ప్రాంతాల్లో అంటే మారుమూల ప్రాంతాల్లోఉండే ప్ర‌జ‌ల‌ కోసం సినిమా థియేట‌ర్ నిర్మించారు. వారికి సినిమా అనుభ‌వాన్ని అందించ‌డం కోసం.. పిక్స‌ర్ టైమ్ డిజిప్లెక్స్ అనే సంస్థ‌ లఢక్ లో మొబైల్ థియేట‌ర్‌ను ఏర్పాటు చేసింది.

ఇది ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సినిమా థియేట‌ర్ గా చరిత్రకెక్కింది. భూమికి 11,562 అడుగుల పైన లెహ్‌లో.. కొండ మీద దీన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఇది.. ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సినిమా థియేట‌ర్‌గా చ‌రిత్ర‌కెక్కి రికార్డు క్రియేట్ చేసింది.గాలితో నింపిన మెటీరియ‌ల్ ఉప‌యోగించి ఈ థియేట‌ర్‌ను నిర్మించారు. ఇది పూర్తిగా వాట‌ర్ ప్రూఫ్ థియేట‌ర్. అక్క‌డ టెంప‌రేచ‌ర్ మైన‌స్ డిగ్రీల‌కు ప‌డిపోయినా కూడా ఆ థియేట‌ర్ ఏమాత్రం చెక్కు చెద‌ర‌కుండా ఉండేలా అత్యంత పటిష్టంగా నిర్మించారు.

థియేట‌ర్‌ను ప్రారంభించాక ల‌ఢ‌క్ ప్రాంతంలో నివ‌సించే చాంగ్‌పా అనే సంచారజాతి మ‌నుషుల ఆధారంగా తెర‌కెక్కించించిన Sekool అనే సినిమాను ఈ థియేటర్ లో ప్ర‌ద‌ర్శించారు. త్వ‌ర‌లోనే ల‌ఢ‌క్ ప్రాంతంలో మ‌రిన్ని మొబైల్ థియేట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని.. పిక్స‌ర్ టైమ్ డిజిప్లెక్స్ సంస్థ ప్రతినిథి సుశీల్ వెల్ల‌డించారు. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి థియేటర్ ఆర్టిస్ట్ మెఫమ్ ఒత్సల్ మాట్లాడుతూ..ఈ మొబైల్ థియేటర్ టిక్కెట్లు సరసమైన ధరలకే లభిస్తాయని తెలిపారు. ఇది లడఖ్ ప్రజలకు కళ మరియు సినిమా ప్రపంచానికి ద్వారం తెరుస్తుందని ఒత్సల్ తెలిపారు.