“లవ్ జీహాద్”కు పాల్పడితే 5ఏళ్ల జైలు శిక్ష

  • Published By: venkaiahnaidu ,Published On : November 17, 2020 / 05:17 PM IST
“లవ్ జీహాద్”కు పాల్పడితే 5ఏళ్ల జైలు శిక్ష

Law Against ‘Love Jihad’ Soon, 5 Years’ Jail దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో “ల‌వ్ జిహాద్” కేసులు పెరిగిపోతున్న విష‌యం తెలిసిందే. అయితే, లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా ఓ చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల కర్ణాటక,హర్యానా ప్రభుత్వాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రేమ పేరుతో మ‌తాంత‌ర వివాహాలు జ‌రుగుతున్నాయ‌ని, హిందూ మ‌తానికి చెందిన అమ్మాయిల‌ను.. ముస్లింలు అక్ర‌మ ప‌ద్ధ‌తిలో పెళ్లి చేసుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో.. ల‌వ్ జిహాద్‌కు వ్య‌తిరేకంగా చ‌ట్టాలు చేసేందుకు ఇప్పటికే కర్ణాటక,హర్యానా సిద్ధమవ్వగా..తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ కూడా ఈ జాబితాలో చేరింది.



అతి త్వరలోనే ల‌వ్ జిహాద్‌కు వ్య‌తిరేకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం చ‌ట్టం తీసుకురాబోతున్నట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ల‌వ్ జిహాద్‌కు పాల్ప‌డిన‌వారికి 5 ఏళ్ల పాటు క‌ఠిన శిక్ష అమ‌లు చేసే విధింగా చ‌ట్టాన్ని త‌యారు చేస్తున్న‌ట్లు న‌రోత్త‌మ్ మిశ్రా తెలిపారు. ల‌వ్ జిహాద్‌పై చ‌ట్టానికి సంబంధించిన బిల్లు(ధర్మ స్వాతంత్ర్య బిల్లు)ను రాబోయే అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ల‌వ్ జిహాద్ లాంటి నేరాల‌ను నాన్ బెయిల‌బుల్‌గా ప్ర‌క‌టించాల‌ని కూడా ఆ బిల్లులో పొందుప‌ర‌చ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.



వివాహం కొరకు స్వచ్ఛంద మత మార్పిడీ కోరుకుంటే..ఓ నెల ముందుగా కలెక్టర్ కు దరఖాస్తు చేస్తుకోవడం తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఈ చట్టం కింద ఏ వర్గాన్ని టార్గెట్ చేయట్లేదని ఆయన సృష్టం చేశారు.



కాగా,ప్రస్తుతమున్న చట్టంలో కూడా “లవ్ జీహాద్’ అనే పదం గురించి వర్ణించలేదని,ఏ కేంద్ర సంస్థ కూడా దీనిపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రప్రభుత్వం కూడా పార్లమెంట్ కు తెలిపిన విషయం తెలిసిందే.