Lockdown : ఢిల్లీలో లాక్‌డౌన్.. బయటకు రావొద్దని చేతులు ఎక్కి మొక్కిన కేజ్రీవాల్

Lockdown : ఢిల్లీలో లాక్‌డౌన్.. బయటకు రావొద్దని చేతులు ఎక్కి మొక్కిన కేజ్రీవాల్

Delhi Covid Lockdown

Delhi Covid Lockdown: దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోగా.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చెయ్యాలని కీలక నిర్ణయం తీసుకుంది. నేటి(19 ఏప్రిల్ 2021) రాత్రి నుంచి వారంరోజుల పాటు ఢిల్లీలో లాక్ డౌన్ విధించనున్నట్లు స్పష్టం చేసింది. దీనిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారిక ప్రకటన చేశారు.

ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 25వేలకు పైగా కేసులు నమోదవగా.. కరోనా రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ICUలో బెడ్స్‌ ఫుల్‌ అవగా.. మరోవైపు ఆక్సీజన్‌ కొరతతో రోగులు బెంబేలెత్తిపోతున్నారు. రెమ్‌డిసివర్‌ కొరత ప్రభావం కూడా రోగులపై పడుతోంది. ఈ క్రమంలోనే ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌ నేటి రాత్రి 10 గంటలకు మొదలై వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకూ అమల్లోకి రానుంది.

‘లాక్‌డౌన్‌లో భాగంగా నిత్యావసరాలు, ఆహార సంబంధిత, వైద్యం సహా ఇతర అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయి. ప్రైవేటు కార్యాలయాలన్నీ వర్క్‌ ఫ్రం హోం ద్వారానే నడవాలి. వివాహ వేడుకలు కేవలం 50 మందితో మాత్రమే జరుపుకోవాలి. అందుకు ప్రత్యేకంగా పాసులు ఇవ్వనున్నారు.