శీతాకాల సమావేశానికి ముందు అఖిల పక్ష భేటీ

శీతాకాల సమావేశానికి ముందు అఖిల పక్ష భేటీ

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రధాని మోడీతో సహా పార్టీ నాయకులంతా కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఉన్నారు. 

రాష్ట్ర సమస్యలను సభలో ప్రస్తావించేందుకు తగిన సమయం ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు కోరారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలు, పోలవరం, కడప స్టీల్‌ ప్లాంట్, రామాయపట్నం పోర్టు అంశాలే తమ ప్రధాన ఎజెండా అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మిధున్‌రెడ్డి తెలిపారు. నామా నాగేశ్వరరావు రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించేందుకు అనుమతించవద్దని స్పీకర్‌కు విన్నవించారు. 

కార్యక్రమంలో ప్రజా సమస్యలపై చర్చించాలని సభా కార్యక్రమాలను సజావుగా సాగేందుకు పార్టీలంతా సహకరించాలని కోరారు. ఎన్డీయే నుంచి శివసేన వైదొలగడంతో పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆ పార్టీ ఎంపీలు కూర్చొనే స్థానాలు మారాయి. ప్రతిపక్ష పార్టీల దగ్గరకు శివసేన సభ్యుల స్థానాలను మార్చారు.