LPG Price: వారం రోజుల్లో మరో రూ.100 పెరగనున్న వంట గ్యాస్

దేశవ్యాప్తంగా వంటగ్యాస్, పెట్రోల్ - డీజిల్, వంట నూనె ధరలు పెరిగిపోతుండగా సామాన్యులకు పెను భారంగా మారింది. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన ధరలు.. మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయట.

LPG Price: వారం రోజుల్లో మరో రూ.100 పెరగనున్న వంట గ్యాస్

Lpg Gas

Updated On : October 27, 2021 / 8:36 PM IST

LPG Price: దేశవ్యాప్తంగా వంటగ్యాస్, పెట్రోల్ – డీజిల్, వంట నూనె ధరలు పెరిగిపోతుండగా సామాన్యులకు పెను భారంగా మారింది. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన ధరలు.. మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయట. ఇంకొక వారం రోజుల్లో మరో రూ.100 పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నష్టాలను తగ్గించుకునే క్రమంలోనే చమురు కంపెనీలు ధరల్లో మరోసారి పెంపు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారట.

ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోకుండా.. ఈ సారి మాత్రం గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తేనే ధరలు పెరగనున్నాయి. ఒకవేళ ఈ సారి కూడా ధరలు పెరిగాయంటే అది ప్రభుత్వం పెంచినట్లే. చమురు సంస్థలు అక్టోబర్ 6న వంటగ్యాస్‌ సిలిండర్‌కు రూ.15 చొప్పున పెంచాయి. జులై నుంచి అక్టోబరు 6 వరకు దీని ధర రూ.90 వరకూ పెరిగింది.

గతేడాది నుంచే ఎల్పీజీపై కేంద్రం రాయితీలు తొలగించింది. పెట్రోల్, డీజిల్ మాదిరి ఎల్పీజీ ధరపై నియంత్రణ ఎత్తేస్తున్నట్లు అధికారికంగా కన్ఫామ్ చేయలేదు. పెరుగుతున్న వంటగ్యాస్ ధరల అంతరాన్ని భరించేందుకు కూడా కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ భారాన్ని భరించేందుకు కేంద్రం సిద్ధంగా లేకుంటే వినియోదారులపై మోపేందుకు చమురు సంస్థలు సిద్ధమవుతున్నాయి.

………………………………………. : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

అంతర్జాతీయంగా ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 85 డాలర్లపైనే ట్రేడ్ అవుతోంది. దీని ప్రభావంతో ముడిచమురు ధరల పెరుగుదల కొనసాగనుంది. ఫలితంగా పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశముందని నిపుణుల అంచనా.