AP Corona : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు | AP Reports 567 New Corona Cases

AP Corona : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ఐదు వందలకు దిగువనే కేసులు నమోదవుతుండగా, తాజాగా 500 మార్క్ దాటాయి.

AP Corona : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

AP Corona : ఏపీలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ఐదు వందలకు దిగువనే కేసులు నమోదవుతుండగా, తాజాగా 500 మార్క్ దాటాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,350 నమూనాలు పరీక్షించగా.. 567 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 8 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు.. కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా బాధితులు మరణించారు.

Pan Number : పాన్ నెంబర్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందా…అయితే జాగ్రత్త..

ఒక్క రోజు వ్యవధిలో 437 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,64,854 కి చేరింది. రికవరీ కేసులు 20,45,713 కు పెరగగా.. కరోనా మృతుల సంఖ్య 14,364 కి ఎగిసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,777 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,93,65,385కు చేరింది.

Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?

తాజాగా నమోదైన కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 161 కేసులు, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా లేదు.

కాగా, దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కరోనా లేదనే భావనలో ప్రజలు ఉన్నారు. కరోనా నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు. మాస్క్ లేకుండా యధేచ్ఛగా తిరుగుతున్నారు. ఇలాగే కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే థర్డ్ వేవ్ ముప్పు త్వరలోనే విరుచుకుపడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ మొదలైంది. రష్యా, బ్రిటన్‌లో కేసులు, మరణాలు అమాంతం పెరిగాయి. చైనాలోనూ వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ఈ క్రమంలో త్వరలోనే భారత్‌లోనూ థర్డ్ వేవ్ ముప్పు ఉండనుందా? అనే భయాందోళన వ్యక్తమవుతోంది. అలాగే అంతర్ రాష్ట్ర, అంతర్జాతీయ రాకపోకలు మళ్లీ యధావిధిగా నడుస్తున్నాయి. దీంతో కరోనా కొత్త వేరియంట్లు భారత్‌లోకి ప్రవేశించడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

×