Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?
ఎప్పుడూ కూర్చుని ఉండటం వల్ల కదలికలు లేక ఎముక పటుత్వమూ తగ్గుతుంది. సాధారణంగా నడక, పరుగు వంటి బరువు మోసే పనులు చేస్తున్న కొద్దీ తుంటి ఎముక, కాళ్లల్లోని ఎముకలు బలిష్టంగా తయారై, వాటి సాంద్రత పెరుగుతుంది.

Sitting : శరీరక శ్రమ తగ్గిపోయింది. టెక్నాలజీ రంగంలో ప్రతి పని యంత్ర పరికరాలే చేస్తుండటం, మరోవైపు సెల్ ఫోన్ లు, కంప్యూటర్ల తో ఏ.సి గదుల్లో ఉద్యోగాల కారణంగా శరీరాలు అటు ఇటు కదిలించేందుకు అవకాశం లేకుండా పోతుంది. ఒకే చోట గంటల తరబడి కూర్చుని పనిచేస్తూ కాలం వెళ్ళదీస్తుండటంతో ఇప్పటికే చాలా మందిని అనేక రకాల జబ్బులు చుట్టుముట్టి అనారోగ్యం పాలు చేస్తున్నాయి. గంటల తరబడి ఒకేచోట కూర్చుని ఉండటం వల్ల ఇబ్బందులు తప్పవని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శారీరకంగా చురుకుగా ఉండేవారితో పోలిస్తే.. రోజులో చాలాసేపు కదలకుండా కూచునే వారికి గుండె జబ్బుల ముప్పు రెండింతలు అధికంగా ఉంటోదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువసేపు కూచుంటే మన శరీరంలోని కండరాలు కొవ్వును ఎక్కువగా కరిగించలేవు. రక్తప్రసరణ కూడా మందగిస్తుంది. దీంతో గుండెలోని రక్తనాళాల్లో కొవ్వు పూడుకోవటం మొదలుపెడుతుంది. ఇదే గుండె జబ్బుకు, గుండె పోటుకు దారి తీస్తుంది. ఎక్కువసేపు కూచోవటం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్ స్థాయులూ పెరుగుతాయి. వీటి కారణంగా గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయి.
ఒకేచోట కూర్చుని ఉండటం వల్ల వెన్నముక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కవగా ఉంటుంది. కుర్చీలో ఎక్కవసేపు కూర్చుని ఉండటం వల్ల వెనక ఉండే వీపు కండరాలు చాలా బిగుతుగా మనల్ని పట్టి ఉంచుతాయి. కడుపు కండరాలు సడలిపోవటం, వీపు కండరాలు బిగుతు కావటం.. దీనివల్ల వెన్నెముక బాగా ముందుకు వంగిపోతోంది. చివరకు వెన్నుముక సమస్యలకు దారితీస్తుంది. రోజంతా కూర్చుని ఉండే వారిలో తుంటి ఎముక బాగం బిగుతుతనం కోల్పోయి నడిచే సమయంలో పటుత్వం కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది.
ఎప్పుడూ కూర్చుని ఉండటం వల్ల కదలికలు లేక ఎముక పటుత్వమూ తగ్గుతుంది. సాధారణంగా నడక, పరుగు వంటి బరువు మోసే పనులు చేస్తున్న కొద్దీ తుంటి ఎముక, కాళ్లల్లోని ఎముకలు బలిష్టంగా తయారై, వాటి సాంద్రత పెరుగుతుంది. కూర్చుని ఉంటే మాత్రం ఎముకలు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. శారీరక శ్రమ లేకపోవటం వల్ల ఇటీవలి కాలంలో ఎముక క్షీణత సమస్య పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు కదలకుండా కూచునేవారికి నడుము దగ్గరి పూసల మధ్య డిస్కులు బయటకు తోసుకుచ్చే ముప్పు ఏర్పడుతుంది.
అటుఇటు కదులుతున్నప్పుడు మెదడుకు రక్త సరఫరా పెరుగుతుంది. మెదడును ఉత్సాహపరిచే, మానసిక స్థితిని మెరుగుపరచే రసాయనాలు విడుదలవుతాయి. దీర్ఘకాలం పాటు శారీరక శ్రమలేకుండా కూర్చునే వారిలో ఇలాంటివన్నీ మందగిస్తాయి. దీంతో మెదడు పనితీరు కూడా క్రమేపీ నెమ్మదిస్తుంది. మెడబాగంపై వత్తిడి సైతం పెరిగే అవకాశాలు అధికం. నిత్యం కూర్చునే ఉండేవారిపై క్యాన్సర్లూ దాడి చేస్తాయి. ముఖ్యంగా వీరికి పెద్దపేగు, రొమ్ము, ఎండోమెట్రియం క్యాన్సర్ల ముప్పు పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువసేపు కూచున్నప్పుడు ఒంట్లో ఇన్సులిన్ స్థాయులు పెరగటం, అది కణాల వృద్ధిని ప్రోత్సహిస్తుండటం.. ఇవన్నీ క్యాన్సర్‌కు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
1Major Movie : ఆ సంఘటన చెబితే నమ్ముతారోలేదో అని సినిమాలో పెట్టలేదు
2PM Cares: రేపే పీఎం కేర్స్ స్కాలర్‌షిప్‌ల పంపిణీ.. ప్రారంభించనున్న మోదీ
3Pan India Stars : RRR, KGF స్టార్లు ఏం చేస్తున్నారు??
4YV Subbareddy : శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావొద్దని ఎప్పుడూ చెప్పలేదు : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
5UN human rights: ఐరాస మానవ హక్కుల బృందం చైనాలో స్వేచ్ఛగా పర్యటించలేదు: అమెరికా
6Kedarnath: కేదార్‌నాథ్‌లో పేరుకుపోతున్న చెత్త.. మోదీ ఏమన్నారంటే
7Nepal plane: నేపాల్‌లో విమానం అదృశ్యం.. ప్రయాణికుల్లో భారతీయులు
8Major : బాలీవుడ్, మలయాళం వాళ్ళు అడిగినా ఒప్పుకోలేదు.. మాకు ఓకే చేశారు..
9pani puri: పానీ పూరీ తిని 97 మంది పిల్లలకు అస్వస్థత
10Elon Musk vs Bhavish: ఎలన్ మస్క్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఓలా సీఈవో
-
Tragedy : పెళ్ళిరోజే భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..అప్పుల బాధ తాళలేక
-
masked Aadhaar card: ఆధార్ కాదు.. మాస్క్డ్ ఆధార్ ఇవ్వండి
-
Thirumala : రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న 89వేల 318 భక్తులు..కరోనా లాక్డౌన్ అనంతరం తొలిసారి
-
Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన
-
Monkeypox : మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఆర్టీ-పీసీఆర్ కిట్
-
Rajasthan : బావిలో దూకి ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్..మహిళల్లో ఇద్దరు గర్భిణులు
-
Hyderabad : ఉద్యోగులకు HRA పెంపు
-
Rain Forecast : మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు