ఇద్దరు యువతుల సహజీవనం, అంగీకరించని పేరెంట్స్..కోర్టుకెక్కిన వ్యవహారం

మధురైకి చెందిన ఇద్దరు అమ్మాయిల పరిచయం ప్రేమకు దారి తీసింది. ఒకరినొకరు ఇష్ట పడ్డారు. ఎంతలా అంటే..ఒకరిని వదలి మరొకరు లేనంతగా ప్రేమలో కూరుకపోయారు.

ఇద్దరు యువతుల సహజీవనం, అంగీకరించని పేరెంట్స్..కోర్టుకెక్కిన వ్యవహారం

Madras High Court

lesbian couple : ఏం ఇద్దరు కలిసి ఉండకూడదా ? తమ భవిష్యత్ గురించి ఇతరులకు ఎందుకు ? అని ప్రశ్నిస్తున్నారు ఇద్దరు యువతులు. ఏదైనా చెప్పాలంటూ..హైకోర్టు మెట్లు ఎక్కారు. దీంతో కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.

మధురైకి చెందిన ఇద్దరు అమ్మాయిల పరిచయం ప్రేమకు దారి తీసింది. ఒకరినొకరు ఇష్ట పడ్డారు. ఎంతలా అంటే..ఒకరిని వదలి మరొకరు లేనంతగా ప్రేమలో కూరుకపోయారు. ప్రేమ బంధంతో కలిసి పోవాలని డిసైడ్ అయ్యారు. సహజీవనం చేశారు. ఈ విషయం ఇరువురి తల్లిదండ్రులకు తెలిసింది. వారిని విడదీయడానికి ప్రయత్నించారు. నచ్చచెప్పారు. కానీ వారు వినిపించుకోలేదు. తమకు ఏదైనా సహయం చేయాలని చెన్నైలోని ఓ స్వచ్చంద సంస్థను ఆశ్రయించింది. వీరి ద్వారా మద్రాసు హైకోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్ బుధవారం హైకోర్టు బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది.

తామిద్దరం కలిసి జీవించేందుకు సిద్ధమయ్యామని, తమ భవిష్యత్ గురించి ఇతరులకు ఎందుకు అని యువతులు ప్రశ్నించారు. తమకు భద్రత కల్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పిటిషన్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం, ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, ఇదివరకు కోర్టులు ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తున్నట్లు బెంచ్ వెల్లడించింది. ఇద్దరు యువతుల వాంగ్మూలం, తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని వేర్వేరుగా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. సమగ్ర విచారణతో ఏప్రిల్ 26వ తేదీ కోర్టుకు నివేదికను సమర్పించాలని సామాజిక కార్యకర్త విద్య దినకరన్ ను ఆదేశించింది.