‘Conflict tiger’ captured: 13 మందిని చంపిన పులిని పట్టుకున్న అధికారులు

మనుషులను చంపుతూ కొంత కాలంగా భయాందోళనలు రేపిన ఓ పులిని అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు ఇవాళ ఉదయం బంధించారు. ‘‘కాంఫ్లిక్ట్ టైగర్ సీటీ-1’’గా అధికారులు పిలుస్తున్న ఆ పులి మహారాష్ట్రలోని గడ్చిరోలీ, చంద్రపూర్ జిల్లాల్లో 13 మందిని చంపింది. ఆ పులిని పట్టుకోవాలని అధికారులు ప్రణాళిక వేసుకున్నారు. అది గడ్చిరోలీలోని వాద్సా అటవీ పరిధిలో తిరుగుతోందని తెలుసుకుని దాని ఎట్టకులకు బంధించి తీసుకెళ్లారు.

‘Conflict tiger’ captured: 13 మందిని చంపిన పులిని పట్టుకున్న అధికారులు

Tiger

‘Conflict tiger’ captured: మనుషులను చంపుతూ కొంత కాలంగా భయాందోళనలు రేపిన ఓ పులిని అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు ఇవాళ ఉదయం బంధించారు. ‘‘కాంఫ్లిక్ట్ టైగర్ సీటీ-1’’గా అధికారులు పిలుస్తున్న ఆ పులి మహారాష్ట్రలోని గడ్చిరోలీ, చంద్రపూర్ జిల్లాల్లో 13 మందిని చంపింది. ఆ పులిని పట్టుకోవాలని అధికారులు ప్రణాళిక వేసుకున్నారు. అది గడ్చిరోలీలోని వాద్సా అటవీ పరిధిలో తిరుగుతోందని తెలుసుకుని దాని ఎట్టకులకు బంధించి తీసుకెళ్లారు.

ఆ పులి వాద్సా అటవీ పరిధిలో ఆరుగురిని, భాందారాలో నలుగురిని, బ్రహ్మపురి అటవీ పరిధిలో ముగ్గురిని చంపిందని అధికారులు వివరించారు. ఆ పులి జాడను గుర్తించి పట్టుకోవడానికి తడోబా పులల సంరక్షణ బృందం, చంద్రపూర్ లోని ఆర్ఆర్టీ బృందం, ఇతర యూనిట్లు పనిచేశామని చెప్పారు. ఆ క్రమంలో గడ్చిరోలీలోని వాద్సా అటవీ పరిధిలో ఇవాళ ఉదయం పులి తిరుగుతుండగా దాన్ని పట్టుకున్నట్లు వివరించారు. ఆ పులిని 183 కిలోమీటర్ల దూరంలోని నాగ్ పూర్ లోని గోరెవాడా రెస్క్యూ సెంటర్ కు తరలించామని తెలిపారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..