CM Eknath Shinde: ఏక్‌నాథ్ షిండే పార్టీకి ‘రెండు కత్తులు.. డాలు’ గుర్తు కేటాయించిన ఈసీ

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన పార్టీకి ‘రెండు కత్తులు.. ఒక డాలు’ గుర్తు కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందే ఆయన పార్టీకి ‘బాలసాహెబాంచి శివసేన’ అనే పేరును ఈసీ కేటాయించింది.

CM Eknath Shinde: ఏక్‌నాథ్ షిండే పార్టీకి ‘రెండు కత్తులు.. డాలు’ గుర్తు కేటాయించిన ఈసీ

CM Eknath Shinde: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే పార్టీకి ‘రెండు కత్తులు.. ఒక డాలు’ గుర్తు కేటాయిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయం తీసుకుంది. షిండే వర్గం కోరిక మేరకు ఈ గుర్తును కేటాయించింది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో శివసేన పార్టీ రెండుగా చీలిన సంగతి తెలిసిందే.

Hindu Girl: పాక్‌లో హిందూ బాలిక కిడ్నాప్.. 15 రోజుల్లో నాలుగో ఘటన

ఉద్ధవ్ థాక్రేను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేలా చేయడంతోపాటు, పార్టీని రెండుగా చీల్చారు ఏక్‌నాథ్ షిండే. తర్వాత బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. దీంతో శివసేన అటు షిండే వర్గం.. ఇటు ఉద్ధవ్ వర్గంగా చీలిపోయింది. దీంతో పార్టీ, గుర్తు ఎవరికి చెందుతాయి అనే సందిగ్ధత మొదలైంది. ఈ నేపథ్యంలో షిండే వర్గానికి ‘బాలసాహెబాంచి శివసేన’ అనే పేరును కేటాయించింది. తాజాగా గుర్తును కూడా కేటాయించింది. త్వరలో జరగనున్న అంధేరి (ఈస్ట్) అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ గుర్తు కావాలని శివసేన ఈసీని కోరింది.

Viral Video: నడిరోడ్డుపై బైక్‌కు అంటుకున్న నిప్పు.. ఎంతమంది కలిసి ఆర్పేశారో.. వీడియో వైరల్

అయితే, ఈ గుర్తు ఉచిత చిహ్నాల జాబితాలో లేదని ఈసీ తెలిపింది. అయితే, రాష్ట్ర పార్టీగా ఉన్న ‘పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్’ పార్టీ 2004లో గుర్తింపు కోల్పోయిందని, ఆ పార్టీ గుర్తులుగా ఉన్న రెండు ‘కత్తులు.. ఒక డాలు’ తమకు కావాలని షిండే వర్గం కోరింది. దీంతో ఈసీ ఈ గుర్తు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.