Mamata Banerjee – PM Modi: మమతాతో మోదీ భేటీ.. కొద్ది గంటల్లో

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారమే ఢిల్లీ చేరుకున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల తర్వాత మమతా దేశరాజధానిలో ప్రధాని మోడీని కలిసేందుకు రావడం ఇదే తొలిసారి. ఐదు రోజుల షెడ్యూల్ లో భాగంగా మంగళవారం సాయంత్రం 4గంటలకు ప్రధానిని కలవనున్నారు.

10TV Telugu News

Mamata Banerjee – PM Modi: వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారమే ఢిల్లీ చేరుకున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల తర్వాత మమతా దేశరాజధానిలో ప్రధాని మోడీని కలిసేందుకు రావడం ఇదే తొలిసారి. ఐదు రోజుల షెడ్యూల్ లో భాగంగా మంగళవారం సాయంత్రం 4గంటలకు ప్రధానిని కలవనున్నారు. ఆ తర్వాత బుధవారం ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ ను కలవనున్నట్లు సమాచారం.

అంతేకాకుండా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని, కమల్ నాథ్, ఆనంద్ శర్మ, అభిషేక్ మను సింగ్వీ లాంటి ఇతర పార్టీ లీడర్లను కూడా కలుసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కమల్ నాథ్,3 గంటలకు ఆనంద్ శర్మ,6:30 కి అభిషేక్ మను సింగ్విని కలిసేలా ప్లాన్ చేస్తున్నారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో పర్యటన పెట్టుకోవడంతో లీడర్లను కలిసేందుకు వీలు కుదురుతుందని భావించారు. నేషనల్ పాలిటిక్స్ లో 2024 లోక్ సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేందుకు మమతా పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రత్యేక క్యాబినెట్ సమావేశం తర్వాతే ఢిల్లీ బయల్దేరారు.

ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు. కోల్‌కతాలోని ఎన్ఎస్సీ బోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద కూడా రిపోర్టర్లతో మాట్లాడకుండా దాటేశారు. ప్రధానితో మీటింగ్ కు తనకు సమయం ఇచ్చారని చెప్పారు. మరే ఇతర వివరాలు చెప్పకుండా వెళ్లిపోయారు.

జులై 26 నుంచి 30 వరకూ జరగనున్న పర్యటనలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నాయి టీఎంసీ వర్గాలు.

10TV Telugu News