రివర్స్ పంచ్: Coca Cola, Thumbs Up నిషేదించమంటే రూ.5లక్షల ఫైన్ వేసిన సుప్రీం

  • Published By: Subhan ,Published On : June 12, 2020 / 01:03 PM IST
రివర్స్ పంచ్: Coca Cola, Thumbs Up నిషేదించమంటే రూ.5లక్షల ఫైన్ వేసిన సుప్రీం

ఆరోగ్యం కాపాడాలంటూ గురువారం వేసిన పిల్ ను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. ఓ సోషల్ వర్కర్ కోకా కోలా, థమ్స్ అప్ లు  నిషేదించాలంటూ పిల్ వేశాడు. ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వల్ల హెల్త్ పాడవుతుందంటూ వేసిన పిటిషన్ కు ఇతర కారణాలు చూపించాడు. టాప్ కోర్టు పిటిషన్ ను తిరస్కరించడమే కాకుండా.. ఐదు లక్షల జరిమానా కూడా విధించింది. 

పిటిషనర్ ను ప్రత్యేకించి రెండు బ్రాండ్లపైనే పిల్ ఎందుకు వేశాడని ప్రశ్నించింది. కోకాకోలా, థమ్స్ అప్ లు మూసేయాలని వేసిన పిటిషన్ పై ఆధారాలు తీసుకురమ్మని అడగడంతో అతను నిరూపించలేకపోయాడు. దీంతో అతను నెల రోజుల్లోగా రూ.5లక్షల ఫైన్ ను అపెక్స్ కోర్టులో జమ చేయాలని.. ఆదేశాలిచ్చింది. 

పిటిషనర్ ఉమెద్సిన్హ్ పీ చాడాను జస్టిసెస్ డీవై చంద్రచుద్ మందలించారు. పిటిషనర్ తాను వేసిన పిల్ పిటిషన్ నిజమేనని అఫిడవిట్ ద్వారా క్లెయిమ్ చేశాడు. కానీ, సబ్జక్ట్ పై ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా పిటిషన్ వేసినట్లు తేలిపోయిందని జస్టిసెస్ హేమంత్ గుప్తా, అజయ్ రస్తోగీ వెల్లడించారు. 

పిటిషన్ ను కొట్టిపారేస్తూ దీని కోసం ఖర్చు అయిన రూ.5లక్షలు పిటిషనర్ చెల్లించాలని ఆదేశాలిచ్చింది. ఆ మొత్తాన్ని సుప్రీం కోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ బెంచ్ కు చెల్లించాలని తెలిపింది. దాంతో పాటు ఎక్కువ మొత్తంలో సాఫ్ట్ డ్రింక్స్ తాగి హెల్త్ పాడుచేసుకోవద్దని సూచించింది. థమ్స్ అప్, కోకా కోలా కంపెనీలు లైసెన్స్ ఇచ్చే ముందే పూర్తి స్థాయిలో విశ్లేషించి రిపోర్టులు ఇచ్చామని పిల్ కు వివరణ ఇచ్చింది.