Youtube Videos : కొంపముంచిన యూట్యూబ్ వైద్యం.. ఆ వీడియోలు చూసి 10 కర్పూరం బిళ్లలు మింగేశాడు, ఆ తర్వాత ఏమైందంటే

డయేరియా తగ్గించుకునేందుకు చిట్కాల కోసం యూట్యూబ్ లో వెతికాడు. Youtube Videos - Camphor

Youtube Videos : కొంపముంచిన యూట్యూబ్ వైద్యం.. ఆ వీడియోలు చూసి 10 కర్పూరం బిళ్లలు మింగేశాడు, ఆ తర్వాత ఏమైందంటే

Youtube Videos - Camphor (Photo : Google)

Youtube Videos – Camphor : కొందరు జనాలు మరీ తెలివి మీరి పోతున్నారు. ఏదైనా అనుమానం వస్తే చాలు గూగుల్, యూట్యూబ్ పై ఆధారపడిపోతున్నారు. అందులో వీడియోలు చూసి తమ సందేహాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇది మరీ శ్రుతి మించుతోంది. కొందరు యూట్యూబ్ లో వీడియోలు చూసి సొంతం వైద్యం చేసుకుంటున్నారు. అయితే, ఇది కొన్ని సందర్భాల్లో వికటిస్తోంది. యూట్యూబ్ లో చూసి సొంత వైద్యం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇలానే యూట్యూబ్ లో చూసి సొంత వైద్యం చేసుకుని ఆసుపత్రి పాలయ్యాడు. డయేరియాతో బాధపడుతున్న అతడు యూట్యూబ్ వీడియోలు చూసి ఏకంగా 10 కర్పూరం బిళ్లలు మింగేశాడు. అంతే ఆ వైద్యం వికటించి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యాడు.

జార్ఖండ్ రాష్ట్రంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. లాతేహార్ జిల్లా బలుమత్ మండలంలోని టోటీ హెస్లా గ్రామానికి చెందిన అవదేశ్ డయేరియా బారినపడ్డాడు. ఎవరైనా జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ కి చూయించుకుంటారు. కానీ, అవదేశ్ మాత్రం అలా చేయలేదు. హాస్పిటల్ కి వెళితే చాలా ఖర్చు అవుతుందని భావించాడు. మరో మార్గం ఎంచుకున్నాడు.

Also Read..Consume Ghee : ఖాళీ కడుపుతో నెయ్యిని తీసుకోవటం మంచిదేనా ? ఆయుర్వేద నిపుణులు ఏంచెబుతున్నారు

ఈ క్రమంలో అతడి దృష్టి యూట్యూబ్ వీడియోలపై పడింది. డయేరియా తగ్గించుకునేందుకు చిట్కాల కోసం యూట్యూబ్ లో వెతికాడు. కర్పూరం మింగితే విరేచనాలు తగ్గుతాయని చాలా వీడియోల్లో చెప్పడం అతడు గమనించాడు. అంతే, మరో ఆలోచన లేకుండా దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయాడు. ఏకంగా 10 కర్పూరం బిళ్లలు మింగేశాడు. అవదేశ్ ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. విరేచనాలు తగ్గడం అటుంచితే.. అతడి ఆరోగ్యం మరింత పాడైంది. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాంతో కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అధిక మోతాదులో కర్పూరం బిళ్లలు మింగేయడంతో అతడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని డాక్టర్లు వెల్లడించారు. రెండు మూడు రోజులు ఆసుత్రిలోనే ఉండాల్సి వస్తుందన్నారు.

యూట్యూబ్ వీడియోలు చూసి చేసుకున్న సొంత వైద్యం వికటించిన ఘటన స్థానికులను షాక్ కి గురి చేసింది. వీడెవడండీ బాబూ అని అంతా తల పట్టుకున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసో, గూగుల్ లో సెర్చ్ చేసో సొంత వైద్యం చేసుకోవడం అంత మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగు కావడం కాదు కదా మరింత ప్రమాదంలో పడటం ఖాయం అంటున్నారు.

Also Read..Blood Sugar : రక్తంలో చక్కెర స్ధాయిలను నియంత్రించటంలో కొత్తిమీర సహాయపడుతుందా ?

వైద్యం విషయంలో సొంత నిర్ణయాలు అస్సలు మంచిది కాదంటున్నారు. యూట్యూబ్ లో వీడియోలు అయినా గూగుల్ లో లభించే సమాచారం అయినా.. కేవలం అవగాహన కోసం మాత్రమే అనేది గుర్తు పెట్టుకోవాలంటున్నారు. అంతేకానీ వాటిని గుడ్డిగా ఫాలో అయితే ఇదిగో ఇలానే ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు. ఏదైనా జబ్బు బారిన పడినప్పుడు వెంటనే డాక్టర్ కి చూపించుకోవాలని, వాళ్లు చెప్పిన విధంగా మందులు వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సొంత వైద్యం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నట్లే అనేది గుర్తు పెట్టుకోవాలంటున్నారు.