Manish Sisodia: సీబీఐ కస్టడీకి మనీష్ సిసోడియా.. ఐదు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు

మనీష్ సిసోడియాను ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మార్చి 4 వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియాను ఆదివారం సాయంత్రం సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Manish Sisodia: సీబీఐ కస్టడీకి మనీష్ సిసోడియా.. ఐదు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశించింది. మనీష్ సిసోడియాను ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

Sourav Ganguly: రిషబ్ పంత్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సౌరవ్ గంగూలీ.. పంత్ ఎప్పుడు తిరిగొస్తాడంటే

మార్చి 4 వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియాను ఆదివారం సాయంత్రం సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరు పరిచింది. ఈ కేసు తదుపరి విచారణ కోసం సిసోడియాను తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరింది. ఈ కేసు విచారణకు సిసోడియా సహకరించడం లేదని, ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టాలంటే తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది.

Dangerous Man: ముంబైలో అడుగుపెట్టిన ‘కిరాతకుడు’.. అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్ఐఏ హెచ్చరిక

ఆయన అనేక ఆధారాల్ని ధ్వంసం చేశారని కూడా కోర్టు దృష్టికి సీబీఐ తెచ్చింది. ఈ అంశంలో సీబీఐ వాదనలతో రౌస్ అవెన్యూ కోర్టు ఏకీభవించింది. దీంతో ఐదు రోజులపాటు సీబీఐ కేంద్ర కార్యాలయంలోనే ఆయనను విచారించబోతున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, ముడుపులు, మద్యం వ్యాపారులతో సంబంధాలు వంటి అంశాలపై సీబీఐ ఆయనను ప్రశ్నించబోతుంది. అయితే, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయనను సీబీఐ విచారిస్తోందని, ఈ కేసులో విచారణకు ఆయన సహకరిస్తున్నారని సిసోడియా తరఫు న్యాయవాదులు వివరించారు. ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చుతూ, సీబీఐకి అనుకూలంగా కోర్టు నిర్ణయం తీసుకుంది.