BJP : 2014విజయం తర్వాత దూకుడుమీదున్న బీజేపీ..మిషన్‌ 2050ని అందుకుంటుందా..?

హైదరాబాద్‌లో జాతీయస్థాయి కార్యవర్గ సమావేశాల ఏర్పాటుతోనే.. దక్షిణాదిని ఫోకస్‌ చేయబోతున్నామని కమలం పార్టీ నేతలు సంకేతాలు పంపారు. మరి సౌత్ ఇండియాలో బీజేపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్.. పార్టీ కేడర్‌ను ఎలా ముందుండి నడిపించబోతున్నారు.. కమలం పార్టీకి ఎదురయ్యే సవాళ్లు ఏంటి ? మిషన్‌ 2050 అని బీజేపీ ముందు నుంచి ప్రయత్నాలు చేస్తోంది.

BJP : 2014విజయం తర్వాత దూకుడుమీదున్న బీజేపీ..మిషన్‌ 2050ని అందుకుంటుందా..?
ad

BJP Mission South India 2050 : హైదరాబాద్‌లో జాతీయస్థాయి కార్యవర్గ సమావేశాల ఏర్పాటుతోనే.. దక్షిణాదిని ఫోకస్‌ చేయబోతున్నామని కమలం పార్టీ నేతలు సంకేతాలు పంపారు. మరి సౌత్ ఇండియాలో బీజేపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్.. పార్టీ కేడర్‌ను ఎలా ముందుండి నడిపించబోతున్నారు.. కమలం పార్టీకి ఎదురయ్యే సవాళ్లు ఏంటి ?

మిషన్‌ 2050 అని బీజేపీ ముందు నుంచి ప్రయత్నాలు చేస్తోంది. 2014విజయం తర్వాత కమలం పార్టీ మరింత దూకుడు మీద కనిపించడం మొదలుపెట్టింది. గత ఎనిమిదేళ్లలో మోదీ ఫేస్‌గా… కులతత్వం, ప్రాంతీయత వంటి అనేక సమీకరణాలను సృష్టించి సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో.. రాజకీయంగా దూసుకుపోతోంది బీజేపీ. 2014లో మిత్రపక్షాలతో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీకి.. 2019కు వచ్చేసరికి నిజానికి పెద్దగా అవసరం లేకుండా పోయింది. 3వందల ప్లస్ అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లి.. సాధ్యం అయ్యేలా చేసింది. దీంతో పాటు తమను ఏ శక్తి ఆపలేదన్న విశ్వాసం కమలనాథుల్లో కనిపిస్తోంది. ఈ మధ్య యూపీలో రాంపూర్, అజంగఢ్‌లో.. ఎన్నికలు జరిగాయ్. నిజానికి అవి రెండు కూడా ముస్లీం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు. పైగా యాదవ్ సమీకరణం కూడా యాడ్ అయింది. అలాంటి స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు అద్భుత విజయం సాధించారు. ఇది కచ్చితంగా కమలానికి పెద్ద బూస్టప్‌ అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

Also read : BJP Mission South India : దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునే సత్తా బీజేపీకి ఉందా? మోదీ, షా సదరన్‌ స్ట్రాటజీ ఏంటి ?

2014 ఎన్నికల తర్వాత ఈశాన్య రాష్ట్రాల గురించి బీజేపీ నేతలు ఎక్కువగా మాట్లాడేవారు. కట్ చేస్తే.. ఐదేళ్లకు అంటే 2019 నాటికి ఆ ప్రాంతంలో కమలం పాగా వేసింది. ఇప్పుడు కూడా సౌత్‌ను టార్గెట్‌ చేసుకుంది. హైదరాబాద్‌ మీటింగ్‌లో షా చెప్పింది కూడా అదే ! మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. మోదీ హవాతో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో యువకులు బీజేపీ వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. హైదరాబాద్ మీటింగ్‌ కేంద్రంగా.. పార్టీ శ్రేణులకు మోదీ గొప్ప సందేశం ఇచ్చారు. మైనారిటీలకు చేరువ కావాలని.. దేశాన్ని శాంతి వైపు నడిపించాలని.. ఉనికిని కాపాడుకునే పార్టీల తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. నిజానికి ఈ మూడు పాయింట్లు బీజేపీ కార్యకర్తలకే కాకుండా విపక్షాలకు ఓ సందేశంగా మారిందన్న చర్చ నడుస్తోంది. ఒకరకంగా మైనార్టీల విషయంలో బీజేపీ తీరుపై విమర్శలు చేసే విపక్షాలకు ఇది పరోక్షంగా కౌంటర్‌ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

బీజేపీని ఢీకొట్టే స్థాయిలో ఇప్పుడు విపక్షాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు బలహీనంగా మారుతోంది. ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసినా.. కమలం జోరును అడ్డుకునే పరిస్థితిలో లేవ్. అందుకే మిషన్‌ 2050కి మరోసారి సాన పెడుతున్నారు అమిత్ షా. దానికి అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. కుటుంబ పాలన అంటూ టార్గెట్‌ చేస్తూ.. బీజేపీ నేతలు విమర్శలు గుప్పించడం వెనక భారీ వ్యూహం కనిపిస్తోంది. కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీతో పాటు.. దక్షిణాదిన టీఆర్ఎస్‌, డీఎంకేను కూడా కుటుంబపాలన వాదనతోనే ఇరుకున పెట్టాలన్న వ్యూహంతో కమలం పార్టీ కనిపిస్తోంది. ఇక అదే సమయంలో దక్షిణాదిన సత్తా చాటేలా దీర్ఘకాలిక వ్యూహాలకు పదును పెడుతోంది.

Also read : bjp: కేసీఆర్ పాలన పోయి, బీజేపీ పాలన రావడం ఖాయమైంది: జేపీ న‌డ్డా

మిషన్‌ 2050పై బీజేపీ మరింత నమ్మకం పెట్టుకోవడానికి మరో ప్రధాన కారణం.. యువత సపోర్ట్‌ ! నాయకత్వం విషయంలోనూ యువతకు పెద్దపీట వేస్తున్నారు. నిజానికి విపక్ష పార్టీల విషయంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు మిషన్‌ 2050 మీద బీజేపీ ఆశలు పెట్టుకునేలా చేస్తోంది. ఈ విశ్వాసమే.. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న వ్యూహానికి పదును పెట్టేలా చేస్తోంది. తెలంగాణలో బీజేపీ దూకుడు పెరిగింది. జనాల నుంచి ఆదరణ కూడా పెరుగుతోందని.. పరేడ్ గ్రౌండ్‌ సభ ప్రూవ్ చేసిందని కమలనాథులు చెప్తున్నారు. దీంతో అక్కడి నుంచి దండయాత్ర మొదలుపెట్టాలని బీజేపీ ఫిక్స్ అయ్యారు. ఐతే తెలంగాణ, అంతో ఇంతో ఒడిశా మినహా.. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో సత్తా చాటడం బీజేపీకి అసాధ్యం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

Also read : bjp: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తాం: అమిత్ షా

విపక్షాలు బలహీనంగా ఉన్నప్పుడే పార్టీని విస్తరించాలి.. అధికారం చేజిక్కించుకోవాలని.. 2050 వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తోంది. ఇది ఉత్తరాది రాష్ట్రాలకు వర్కౌట్ అవుతుంది కానీ.. దక్షిణాది రాష్ట్రాల విషయంలో సక్సెస్ అయ్యే అవకాశం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయ్. వాటిని ఢీకొట్టి.. అధిగమించాలంటే.. ఇప్పటికిప్పుడు కమలానికి సాధ్యం అయ్యే పని కాదు. ఐనా అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో మోదీ, షా ద్వయానికి ఓ ప్రత్యేక పేరు ఉంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో కమలం వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్.. ఎలాంటి మలుపులు చూడబోతున్నామన్న ఆసక్తి జనాలతో పాటు, రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.