BJP Mission South India : దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునే సత్తా బీజేపీకి ఉందా? మోదీ, షా సదరన్‌ స్ట్రాటజీ ఏంటి ?

మలం పార్టీ.. ఆపరేషన్ సౌత్ ఇండియా స్టార్ట్ చేసింది. తెలంగాణ నుంచే దండయాత్ర మొదలుపెట్టాలని ఫిక్స్ అయింది. వచ్చే 40 ఏళ్లు బీజేపీదే అధికారం అని.. బెంగాల్, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో తమదే అధికారం అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయ్. నిజంగా సౌత్ ఇండియాలో సత్తా చాటే సీన్ బీజేపీకి ఉందా..?

BJP Mission South India : దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునే సత్తా బీజేపీకి ఉందా? మోదీ, షా సదరన్‌ స్ట్రాటజీ ఏంటి ?

Bjp Mission South India

BJP mission south india : కమలం పార్టీ.. ఆపరేషన్ సౌత్ ఇండియా స్టార్ట్ చేసింది. తెలంగాణ నుంచే దండయాత్ర మొదలుపెట్టాలని ఫిక్స్ అయింది. వచ్చే 40 ఏళ్లు బీజేపీదే అధికారం అని.. బెంగాల్, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో తమదే అధికారం అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయ్. తెలంగాణలో సంగతి సరే.. నిజంగా సౌత్ ఇండియాలో సత్తా చాటే సీన్ బీజేపీకి ఉందా.. అసలు కమలం పార్టీ ఇంత ధీమా ఎందుకు ?

రెండు సీట్లతో ప్రయాణం మొదలుపెట్టి.. రాజకీయాల్లో వన్ అండ్‌ ఓన్లీగా మారుతోంది బీజేపీ ! ఉత్తరాది రాష్ట్రాల్లో విజయయాత్ర సాగిస్తోంది. పశ్చిమాన పట్టు సాధించింది. ఈశాన్య రాష్ట్రాలను ఒడిసి పట్టుకుంది. కమలానికి ఏదైనా అసంతృప్తి ఉంది అంటే.. అది దక్షిణాది రాష్ట్రాలతోనే ! కర్ణాటక తప్ప.. మిగతా ఏ రాష్ట్రాల్లోనూ అధికారం దక్కించుకోలేకపోయింది. కనీసం చేరువకాలేకపోయింది. అలాంటిది ఇప్పుడు కమలనాథుల స్వరాలు కంచుకంఠంగా వినిపిస్తున్నాయ్. హైదరాబాద్‌ సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయ్. రాబోయే 40 ఏళ్లు బీజేపీదే అధికారం అని.. తెలంగాణ, బెంగాల్‌తో సహా అన్ని రాష్ట్రాల్లో కాషాయ ప్రభుత్వాలు ఏర్పడుతాయని ధీమాగా చెప్పడం.. ఇప్పుడు రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది.

Also read : BJP : 2014విజయం తర్వాత దూకుడుమీదున్న బీజేపీ..మిషన్‌ 2050ని అందుకుంటుందా..?

2024 ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్ల సమయం ఉంది. ఐతే హైదరాబాద్‌ మీటింగ్‌లోనే బీజేపీ తన టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. రాబోయే 30, 40 ఏళ్లు బీజేపీ శకం ఉంటుందని.. ఆ తర్వాత భారత్‌ విశ్వగురువుగా మారుతుందని.. హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయ్. దక్షిణాదిలో పార్టీ విస్తరణ, బలోపేతంపై దృష్టి సారించామని.. తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని షా అన్నారు. తెలంగాణతోపాటు పశ్చిమబెంగాల్‌లో కుటుంబ పాలనకు చరమగీతం పాడటమే లక్ష్యమని.. ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ కాషాయ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆయన ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానం ఇప్పుడు రాజకీయవర్గాల్లో కొత్త ఆసక్తి రేకెత్తిస్తోంది.

షా చెప్పినట్లు.. అది నిజం అవుతుందా అంటే.. 2014 ఎన్నికల తర్వాత జరిగిన, జరుగుతున్న పరిణామాలు వారిలో విశ్వాసం నింపాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. తెలంగాణలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు కమలనాథుల్లో కొత్త ఉత్సాహం నింపినట్లు కనిపిస్తున్నాయ్. సదరన్ ఆపరేషన్‌ తెలంగాణ నుంచే ప్రారంభించాలని.. హైదరాబాద్‌ నుంచి దండయాత్ర మొదలుపెట్టాలని ఫిక్స్ అయినట్లు అనిపించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం కొనసాగుతోంది. రెండుసార్లు కేంద్రంలో విజయం సాధించింది. ఒకప్పుడు నామమాత్రపు సీట్లతో ఉందంటే ఉంది అని అనిపించుకున్న ఈ పార్టీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ బలమైన కేడర్‌ సంపాదించుకుంది. 2014 తర్వాత అన్ని ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతూ వస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ కాస్త బలపడింది. బీజేపీకి సౌత్ ఫోబియా మాత్రం పోవటం లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో గట్టి పట్టు సాధించిన బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి డీలా పడిపోయింది.

Also read : bjp: తెలంగాణ‌లో అరాచ‌క పాల‌న‌.. ఇక్కడా బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: యోగి, పీయూష్

దక్షిణాది రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు బలంగా ఉండటంతో కమలం పార్టీ పావులు పెద్దగా పారలేదు. దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీకి జాతీయస్థాయి నేతలు ఉన్నా.. అధికారం తెచ్చి పెట్టే నాయకులు మాత్రం కనిపించలేదు. కొన్నేళ్లుగా బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో చేదు అనుభవమే మిగిలింది. ఐతే 2019 ఎన్నికల తర్వాత కమలం పార్టీలో కొత్త హోప్ మొదలైంది. తెలంగాణలో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడంతో.. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తున్నట్టు కనిపిస్తున్నట్లు గ్రహించింది. మోదీ, షా ద్వయం తమదైన వ్యూహాలతో.. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ ఉనికిని చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తూ వస్తున్నారు.

1980లో పార్టీ ఏర్పాటైన నాటి నుంచి.. దక్షిణాదిలో పాగా వేసేందుకు బీజేపీ గట్టిప్రయత్నాలు చేస్తోంది. మోదీ, షా ద్వయం వ్యూహరచన చేసినప్పటికీ.. కేవలం కర్ణాటకలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కేరళ, ఏపీ, తమిళనాడు, తెలంగాణలో అధికారం ఇంకా కలగానే ఉండిపోయింది. అందుకే ఈ సారి దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. 2023లో కర్ణాటక, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ్. 2026లో కేరళ, తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయ్. నిజానికి బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్నప్పుడే మిషన్ సౌత్‌ ఇండియా సిద్ధం అయిందని.. అదే ఇప్పుడు అమలు చేయబోతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణతో.. తెలంగాణపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టిసారించింది. రెండు ఉప ఎన్నికల్లో గెలవటం సహా జీహెచ్‌ఎంసీలో పలు చోట్ల విజయం సాధించటం, ఆ పార్టీలో విశ్వాసాన్ని పెంచింది. ఆ రెండు ఉప ఎన్నికల్లోనూ అభ్యర్థికున్న ఫాలోయింగ్ వల్లే గెలుపు సాధ్యపడిందన్న వాదన వినిపిస్తున్నా.. తెలంగాణ జనాలు తమను నమ్ముతున్నారనటానికి ఇదే సాక్ష్యమంటూ ప్రచారం చేసుకుంటోంది కాషాయ పార్టీ. జేపీ నడ్డా సహా అమిత్‌షా కూడా ఈ మధ్య కాలంలో తెలంగాణలో పర్యటించారు. ప్రధాని మోదీ కూడా ఈ ఏడాది మేలో హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో చేసిన ప్రసంగంలో కేసీఆర్ కుటుంబ పాలనపై విమర్శలు చేశారు. రాజకీయాల్లో నెపోటిజం కారణంగా యువత నష్టపోతోందనీ ప్రస్తావించారు. ఎన్నో ఏళ్ల పాటు ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి కేవలం ఓ కుటుంబానికే పరిమితం కాకూడదంటూ మండిపడ్డారు. ఇలా తరచు పర్యటనలు చేస్తూ.. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అనే భావన బలపడేలా చేస్తోంది బీజేపీ.

Also read : bjp: డ‌బుల్ ఇంజ‌న్ ప్ర‌భుత్వం కోసం తెలంగాణ ప్ర‌జ‌లు ప‌ట్టాలు వేస్తున్నారు: మోదీ

ఇక అటు తమిళనాడులోనూ ఈ మధ్యకాలంలో.. ప్రధాని మోదీ వరుస పర్యటనలు జరిపారు. తమిళనాడులో మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నెగ్గుకురావటం.. ఇప్పటికిప్పుడు బీజేపీకి అంత సులభం కాదు. అక్కడ ద్రవిడ పార్టీలదే హవా. హిందీ విషయంలో షా చేసిన వ్యాఖ్యలు… ఇప్పటికే ఆ రాష్ట్రంలో అలజడి సృష్టించాయ్. ఇది కమలం పార్టీకి కచ్చితంగా దెబ్బే ! ఇక తర్వాత టార్గెట్‌ కేరళ. లెఫ్ట్‌ పార్టీలు కాకుండా… అక్కడ వేరే ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. అంతగా బలపడిపోయాయి వామపక్షాలు. అయితే ఈసారి ఇక్కడ కూడా గెలవాలని భావిస్తోంది కాషాయ పార్టీ. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక…. ఈ 5 రాష్ట్రాల్లో దాదాపు 129ఎంపీ సీట్లున్నాయి. 2024లో బీజేపీ ఇక్కడ కూడా గెలవాలంటే వీరందిరినీ అధిగమించక తప్పదు. అందుకే ఈ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది అధిష్ఠానం. వ్యూహాలు సిద్ధం చేస్తోంది..