bjp: డ‌బుల్ ఇంజ‌న్ ప్ర‌భుత్వం కోసం తెలంగాణ ప్ర‌జ‌లు ప‌ట్టాలు వేస్తున్నారు: మోదీ

మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌నకు కేంద్ర ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఇస్తోంద‌ని మోదీ తెలిపారు. హైద‌రాబాద్‌లో అనేక‌ ఫ్లై ఓవ‌ర్లు నిర్మించామ‌ని చెప్పుకొచ్చారు. బీజేపీ పాల‌న‌లో తెలంగాణ‌లో హైవేలు రెండు రెట్లు పెరిగాయ‌ని చెప్పారు. ఆవిష్క‌ర‌ణ‌ల్లో తెలంగాణ ముందుంద‌ని, దేశానికి కేంద్రంగా మారింద‌ని ఆయ‌న అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీకి మంచి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని చెప్పారు.

bjp: డ‌బుల్ ఇంజ‌న్ ప్ర‌భుత్వం కోసం తెలంగాణ ప్ర‌జ‌లు ప‌ట్టాలు వేస్తున్నారు: మోదీ

Modi In Hyderabad

bjp: తెలంగాణ మొత్తం ఇవాళ సికింద్రాబాద్‌లోని ప‌రేడ్‌ గ్రౌండ్‌లో కూర్చున్నట్లు అనిపిస్తోందని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ అన్నారు. ఆ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వ‌హిస్తోన్న విజ‌య సంక‌ల్ప స‌భ‌లో మోదీ పాల్గొని ప్ర‌సంగించారు. సోదర, సోదరీమణులకు నమస్కారాలు అంటూ ఆయ‌న తెలుగులో ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ గడ్డకు నమస్కారమని చెప్పారు. ప‌రేడ్ గ్రౌండ్‌కు చాలా దూరం నుంచి వచ్చిన బీజేపీ శ్రేణుల‌ను ఆయ‌న అభినందించారు. హైదరాబాద్‌ నగరం అన్ని రంగాల వారికి అండగా నిలుస్తోందని ఆయ‌న కొనియాడారు.

bjp: అందుకే తెలంగాణ‌లో బీజేపీ స‌ర్కారు రావాలి: బండి సంజ‌య్‌

దేశంలో తాము ఎనిమిదేళ్ళ‌లో పేదలు, ద‌ళితులు, గిరిజ‌నులు, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఎన్నో కొత్త‌ విధానాల‌ను తీసుకొచ్చామ‌ని ప్ర‌ధాని మోదీ చెప్పారు. అందుకే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ ప్ర‌భుత్వంపై, విధానాల‌పై న‌మ్మ‌కం ఉంచార‌ని ఆయ‌న అన్నారు. బీజేపీ దేశ వ్యాప్తంగా అందరి ఆకాంక్షలను నెరవేర్చేందుకే పనిచేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తార‌ని మోదీ అన్నారు. అలాగే, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చాలా నైపుణ్యాలు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. గొప్ప చ‌రిత్ర‌, సంస్కృతి తెలంగాణలో ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఇది మ‌న అంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ఆయ‌న చెప్పారు.

bjp: తెలంగాణ‌లో అరాచ‌క పాల‌న‌.. ఇక్కడా బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: యోగి, పీయూష్

తెలంగాణ ఓ ప‌విత్ర భూమి అని ఆయ‌న వ్యాఖ్యానించారు. దేశ ప్ర‌జ‌ల‌కు యాదాద్రి, జోగులాంబ‌, భ‌ద్ర‌కాళి ఆశీస్సులు ఉంటాయ‌ని ఆయ‌న చెప్పారు. క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో తాము ఇక్క‌డి ప్ర‌జ‌లు అంద‌రికీ అండ‌గా ఉన్నామ‌ని మోదీ అన్నారు. తెలంగాణ నుంచి భారీగా ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆయన చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ ను నిర్మిస్తున్నామని తెలిపారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌నకు కేంద్ర ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఇస్తోంద‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లో అనేక‌ ఫ్లై ఓవ‌ర్లు నిర్మించామ‌ని చెప్పుకొచ్చారు. బీజేపీ పాల‌న‌లో తెలంగాణ‌లో హైవేలు రెండు రెట్లు పెరిగాయ‌ని చెప్పారు. ఆవిష్క‌ర‌ణ‌ల్లో తెలంగాణ ముందుంద‌ని, దేశానికి కేంద్రంగా మారింద‌ని ఆయ‌న అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీకి మంచి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని చెప్పారు. డ‌బుల్ ఇంజ‌న్ ప్ర‌భుత్వం కోసం తెలంగాణ ప్ర‌జ‌లు ప‌ట్టాలు వేస్తున్నార‌ని మోదీ అన్నారు.