bjp: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తాం: అమిత్ షా

తెలంగాణ‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో త‌మ పార్టీయే విజయం సాధిస్తుంద‌ని కేంద్ర మంత్రి, బీజేపీ నేత అమిత్ షా ధీమా వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్న‌ బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో ఆయ‌న మాట్లాడుతూ... ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్ప‌టికీ తెలంగాణ‌లో త‌మ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అన్నారు.

bjp: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తాం: అమిత్ షా

Amit Shah On Telangana

bjp: తెలంగాణ‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో త‌మ పార్టీయే విజయం సాధిస్తుంద‌ని కేంద్ర మంత్రి, బీజేపీ నేత అమిత్ షా ధీమా వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్న‌ బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో ఆయ‌న మాట్లాడుతూ… ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్ప‌టికీ తెలంగాణ‌లో త‌మ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఎలా ముఖ్య‌మంత్రి చేయాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచన అని ఆయ‌న ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం జ‌రుగుతున్న‌ సమయంలో తాము మ‌ద్ద‌తు తెలిపామ‌ని చెప్పారు.

Madhya Pradesh: ఓ చెట్టు కొమ్మ నుంచి మరో చెట్టుకొమ్మ పైకి ఎగిరి కోతి పిల్ల‌ను ప‌ట్టుకున్న పులి.. వీడియో

త‌మ ప్ర‌భుత్వం గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసింద‌ని ఆయ‌న అన్నారు. ఆ స‌మ‌యంలో ఎటువంటి సమస్యలూ రాలేదని చెప్పారు. ఇప్పుడు మాత్రం తెలంగాణ, ఏపీ విష‌యంలో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఏఐఎంఐఎం అధినేత‌ అసదుద్దీన్‌ ఒవైసీ చేతుల్లో ఉందని ఆయ‌న ఆరోపించారు. అప్ప‌ట్లో స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్‌ పటేల్ జోక్యం చేసుకోక‌పోతే హైదరాబాద్ భారత్‌లో భాగం కాక‌పోయేద‌ని ఆయ‌న చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న‌ రాజకీయాలు స‌రికాద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. పాక్‌పై మెరుపుదాడుల నుంచి ఇటీవ‌ల‌ రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ప్ర‌శ్నించ‌డం వ‌ర‌కు అన్నీ రాజకీయాలే చేస్తోందని ఆయ‌న చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించడం లేదని, తాము అధికారంలోకి రాగానే నిర్వహిస్తామని ఆయన అన్నారు.

Maharashtra: న‌న్ను సీఎంను చేసి మోదీ, షా అంద‌రి క‌ళ్ళూ తెరిపించారు: ఏక్‌నాథ్ షిండే

మ‌రోవైపు, దేశంలో త‌దుప‌రి 30-40 సంవ‌త్స‌రాల పాటు బీజేపీ శ‌కం కొన‌సాగుతుంద‌ని, భార‌త్‌ను విశ్వ‌గురుగా నిల‌బెడ‌తామ‌ని అమిత్ షా చెప్పారు. తెలంగాణ‌తో పాటు ప‌శ్చిమ బెంగాల్‌లో కుటుంబ రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఆయా రాష్ట్రాల్లో కుటుంబ పాల‌న‌కు త‌మ పార్టీ చ‌ర‌మ గీతం పాడేలా చేస్తుంద‌ని అమిత్ షా అన్నారు.