Modi Cabinet : తెలుగు రాష్ట్రాల నేతలకు కేబినెట్ విస్తరణలో దక్కని స్థానం

రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత...జరుగుతున్న కేబినెట్ విస్తరణలో భాగంగా..సమూల మార్పులు చేపట్టారు. కీలక మంత్రిత్వ శాఖలను మినహాయించి..అన్ని శాఖల్లో మార్పులు చేస్తున్నారని సమాచారం.

Modi Cabinet : తెలుగు రాష్ట్రాల నేతలకు కేబినెట్ విస్తరణలో దక్కని స్థానం

Telugu States Cabinet

Modi Cabinet Reshuffle 2021 : రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత…జరుగుతున్న కేబినెట్ విస్తరణలో భాగంగా..సమూల మార్పులు చేపట్టారు. కీలక మంత్రిత్వ శాఖలను మినహాయించి..అన్ని శాఖల్లో మార్పులు చేస్తున్నారని సమాచారం. రక్షణ, హోం, ఆర్థిక, రోడ్ల శాఖలు మినహాయించి..ఏడుగురు మంత్రులకు కేబినెట్ హోదా కల్పించనున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా దక్కనుందని తెలుస్తోంది.

యువతకు పెద్ద పీఠ : –
కేంద్ర కేబినెట్ లో యువతకు పెద్ద పీఠ వేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అయితే…కొత్తగా తెలుగు రాష్ట్రాల నేతలకు కేబినెట్ లో స్థానం దక్కలేదు. ఈసారి తెలంగాణకు చెందిన మరో ఎంపీకి ఛాన్స్ దక్కుతుందని స్థానిక బీజేపీ నేతలు ఆశించారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు పేరును ప్రధాని మోడీ, బీజేపీ అగ్రనేతలు పరిశీలించినట్లు తొలుత ప్రచారం జరిగింది. ఇప్పటికే కేంద్ర కేబినెట్‌లో కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండగా తెలంగాణ నుంచి రెండో వ్యక్తిగా బాపూరావుకు అవకాశం కల్పించనున్నట్లుగా జోరుగా పుకార్లు షికారు చేశాయి. కానీ..అలాంటిదేమి జరగలేదు.

43 మంది ప్రమాణ స్వీకారం : –
పాత మంత్రులతో కలిసి..సాయంత్రం… 6.00 గంటలకు 43 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే కొత్త మంత్రులకు ఆహ్వానాలు అందాయి. మంత్రులతో సమావేశమైన..మోదీ..వారికి దిశా.నిర్దేశం చేశారు. ఏ ఏ పదవులు ఇవ్వనున్నారనే సూచనప్రాయంగా తెలియచేసినట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డికి ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారననే తెలియడం లేదు.

రాష్ట్రపతి భవన్ : –
రాష్ట్రపతి భవన్ కు కొత్త మంత్రులు వెళ్లనున్నారు. అక్కడ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 22 మంది కొత్త వారికి ఈసారి మంత్రులుగా అవకాశం ఇచ్చినట్లు సమాచారం. పాత, కొత్త మంత్రులు కలిసి మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆరు గంటలకు రాష్ట్రపతి భనన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు