Monsoon : వెదర్ అప్ డేట్, బంగాళాఖాతంలో అల్పపీడనం..పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

బంగాళఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడి ప్రతాపానికి రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల్లో వరద పోటెత్తింది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కోల్‌కతా నగరం తడిసి ముద్దవుతోంది.

Monsoon : వెదర్ అప్ డేట్, బంగాళాఖాతంలో అల్పపీడనం..పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Rains

Heavy Rains : బంగాళఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడి ప్రతాపానికి రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల్లో వరద పోటెత్తింది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కోల్‌కతా నగరం తడిసి ముద్దవుతోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

ఉత్తరప్రదేశ్‌లోనూ వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. బరేలీలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాలనీల్లోకి నీరు చేరింది. ఇటు బీహార్‌లోనూ వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దాటికి నదులు, చెరువులు, వాగులు, వంకలు నిండు కుండలా మారాయి. ఈస్ట్ చంపారన్‌లో గండక్‌ బ్యారేజీ నిండిపోయింది. దీంతో సమీప గ్రామాలు జలమయం అయ్యాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాల ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పలు చోట్ల చెట్లు, హోర్డింగ్స్‌ కుప్పకూలాయి. జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన కమాన్‌ బోర్డు రోడ్డుపై అడ్డంగా పడింది. దీని కింద ఓ ఆటో ఇరుక్కుని ధ్వంసమైంది. రోడ్డుకి అడ్డంగా పడటంతో జేసీబీని రప్పించి హోర్డింగ్‌ను తొలగించారు అధికారులు.