వీడి ఐడియా తగలయ్యా : Wi-Fi పేరు ‘లష్కర్-ఈ-తాలిబన్’

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో కానీ.. వీడి ఐడియా మాత్రం ముంబై పోలీసులను పరిగెత్తించింది.

  • Published By: sreehari ,Published On : February 18, 2019 / 01:25 PM IST
వీడి ఐడియా తగలయ్యా : Wi-Fi పేరు ‘లష్కర్-ఈ-తాలిబన్’

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో కానీ.. వీడి ఐడియా మాత్రం ముంబై పోలీసులను పరిగెత్తించింది.

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో కానీ.. వీడి ఐడియా మాత్రం ముంబై పోలీసులను పరిగెత్తించింది. ఉరుకులు – పరుగులతో కలకలం రేపింది. పోలీసులను చెమటలు పట్టించడమే కాదు చుట్టపక్కల వాళ్లూ కూడా భయంతో గజగజ వణికిపోయారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనతో దేశమంతా షాక్ లో ఉంటే.. ఈ 20 ఏళ్ల కాలేజీ కుర్రాడు చేసిన తింగర పనికి నగరమంతా అలజడి రేగింది.

ఇంతకీ ముంబై కుర్రాడు చేసిన ఆకతాయి పని ఏంటో తెలుసా? తాను వాడే వై-ఫై నెట్ వర్క్ కు .. ‘లష్కరే-ఈ-తాలిబన్’ అని పేరు పెట్టడమే. మహారాష్ట్రలోని కల్యాణ్ నగర్ లో అమ్రత్ హెవెన్ సోసైటీ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. వై-ఫై కోసం సెర్చ్ చేసిన పక్క అపార్ట్ మెంట్ వాళ్లకు తన వై-ఫై నెట్ వర్క్ కు లష్కరే తాలిబన్ పేరు ఉండటంతో షాక్ అయ్యారు. ఇక్కడే ఎక్కడో ఉగ్రవాదులు వై-ఫై వాడుతున్నారనే భయంతో వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. 

 

అపార్ట్ మెంట్ ను చుట్టుముట్టారు. వై-ఫై నెట్ వర్క్ ను ట్రేస్ చేశారు. చివరికి ఆ వైఫ్ వాడే కాలేజీ కుర్రాడిని పట్టుకున్నారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు అతడ్ని ప్రశ్నించగా.. దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. వేరే వాళ్లు తన వై-ఫై పాస్ వర్డ్ హ్యాక్ చేయకుండా ఉంటారని, ఫన్నీగా, యూనిక్ గా ఉంటుందని వైఫై నేమ్ ఇలా పెట్టానని నవ్వుతూ చెప్పాడు. అంతే.. పోలీసులు కంగుతిన్నారు. సరదా కోసం ఇలాంటి పేర్లు పెట్టకూడదని, వెంటనే మార్చమంటూ సున్నితంగా హెచ్చరించారు. మరోసారి ఇలాంటి పేర్లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Read Also : అసెంబ్లీలో ఏడ్చిన ఎమ్మెల్యే : 10 లక్షలు పోయాయి

Read Also : గ్లోబల్ ట్రెండ్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ కు బాలయ్య డైలాగ్ వార్నింగ్స్

Read Also : సందేహాలున్నాయి : ఎన్నికలకు ముందే దాడి వెనుక మతలబేంటి?