Congress: సోనియాగాంధీపై నగ్మ సంచలన వ్యాఖ్యలు.. నా 18ఏళ్ల తపస్సు వృథాయేనా అంటూ ట్వీట్..

కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ సీనియర్ నేత, సినీ నటి నగ్మ ఫైర్ అయ్యారు. రాజ్య సభ సీటు కేటాయింపు విషయంలో తనకు అన్యాయం జరిగిదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను పార్టీలో చేరినప్పుడు 18ఏళ్ల క్రితం సోనియాగాంధీ రాజ్యసభ అవకాశం ...

Congress: సోనియాగాంధీపై నగ్మ సంచలన వ్యాఖ్యలు.. నా 18ఏళ్ల తపస్సు వృథాయేనా అంటూ ట్వీట్..

Nagma

Congress: కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ సీనియర్ నేత, సినీ నటి నగ్మ ఫైర్ అయ్యారు. రాజ్య సభ సీటు కేటాయింపు విషయంలో తనకు అన్యాయం జరిగిదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను పార్టీలో చేరినప్పుడు 18ఏళ్ల క్రితం సోనియాగాంధీ రాజ్యసభ అవకాశం కల్పిస్తానని చెప్పారని, ఇప్పటి వరకు ఆ అవకాశమే రాలేదా అంటూ ప్రశ్నించారు. వచ్చేనెల 10న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆదివారం పది మంది రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కొంతమంది సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ సీటును ఆశించి భంగపాటుకు గురైన పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ట్వీటర్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అదేవిధంగా కాంగ్రెస్ ముంబయి యూనిట్ వైస్ ప్రెసిడెంట్, సినీ నటి నగ్మసైతం తనకు రాజ్యసభకు అవకాశం కల్పించక పోవటం పట్ల తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో పవన్ ఖేరా ట్వీట్ కు నగ్మ స్పందిస్తూ ‘ నా 18ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ భాయ్ ముందు తక్కువైంది అంటూ పార్టీ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు.

Congress: ఐదు నెలల్లో కాంగ్రెస్‌ను వీడిన ఐదుగురు నేతలు

అంతేకాక 2003-04లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు స్వయంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే నన్ను రాజ్యసభకు పంపుతానని మాటిచ్చారు. అప్పటి నుంచి ఈ 18ఏళ్లలో వారు నాకు ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ను ఎంపిక చేశారు. ఆ పదవికి నేను తక్కువ అర్హురాలినా? అంటూ నగ్మ కాంగ్రెస్ ను ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలతో పెద్దల సభలో కాంగ్రెస్ బలం కాస్త పెరగనుంది. అయితే రాజ్యసభ సభ్యుల జాబితాను ఆదివారం కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. ఇప్పటికే రాజ్యసభ వెళ్లాలని ఆశించిన వారు టికెట్ రాకపోవటంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.