భారత్-రష్యాలు దానికి పూర్తి వ్యతిరేకం

  • Published By: venkaiahnaidu ,Published On : September 4, 2019 / 09:57 AM IST
భారత్-రష్యాలు దానికి పూర్తి వ్యతిరేకం

భారత్ – రష్యా 20వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనడంతో పాటుగా,వ్లాదివోత్సక్ లో జరిగే  5వతూర్పు దేశాల ఆర్థిక సదస్సు(EEF)లో పాల్గొనేందుకు ప్రత్యేక అతిధిగా రష్యా వెళ్లిన భారత ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ తోవ్లాదివోత్సక్ లో సమావేశమయ్యారు. పుతిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. EEF పాల్గొనాల పుతిన్  తనను ఆహ్వానించడం గొప్ప గౌరవమైన విషయమని మోడీ అన్నారు.  భారత్-రష్యాల మధ్య మద్దతుకు కొత్త కోణాన్ని ఇవ్వడానికి ఇది చారిత్రక సందర్భమన్నారు. రేపు ఈ సదస్సులో పాల్గొనేందుకు తాను ఎదురుచూస్తున్నానన్నారు. 

తనకు రష్యా అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడంపై మోడీ స్పందిస్తూ…రష్యా ప్రభుత్వానికి,ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మన 2 దేశాల ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ప్రదర్శిస్తుంది. ఇది 1.3 బిలియన్ల భారతీయులకు గౌరవప్రదమైన విషయం. రష్యా భారతదేశపు సమగ్ర ఫ్రెండ్,నమ్మదగిన భాగస్వామి.  రెండు దేశాల ప్రత్యేక, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడంపై రష్యన్ మీడియా వ్యక్తిగతంగా దృష్టి పెట్టిందని మోడీ అన్నారు. మోడీ,పుతిన్ ల సమక్షంలో ఇరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి..రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, పారిశ్రామిక సహకారం, ఇంధనం మరియు కనెక్టివిటీ కారిడార్లపై రెండు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇరు దేశాధినేతలు జాయింట్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

వ్లాదివోత్సక్ వచ్చిన తొలి భారత ప్రధాని తానే కావడం చాలా సంతోషంగా ఉందని మోడీ అన్నారు. తనను ఇక్కడికి ఆహ్వానించిన పుతిన్ కు ధన్యవాదాలు తెలిపారు. 2001లో జరిగిన వార్షిక ద్వైపాక్షిక సదస్సు రష్యాలో జరిగిన సమయంలో పుతిన్ అప్పుడు దేశ అధ్యక్షుడిగా ఉన్నాడని,ఈ సదస్సులో పాల్గొనేందుకు అప్పటి భారత ప్రధాని వాజే పేయి డెలిగేషన్ లో తాను గుజరాత్ సీఎంగా రష్యాకు వచ్చిన విషయాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఏ దేశ అంతర్గత వ్యవహారంలోనైనా ఇతరులు జోక్యం చేసుకోవడాన్ని భారత్-రష్యాలు వ్యతిరేకిస్తాయని మోడీ అన్నారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370రద్దు భారత్ అంతర్గత వ్యవహారమని రష్యా ఇప్పటికే సృష్టం చేసిన విషయం తెలిసిందే.