ఆ రెండు రోజులు ఉచితంగా Netflix సర్వీస్

ఆ రెండు రోజులు ఉచితంగా Netflix సర్వీస్

Netflix

Netflix ఇండియాలో అద్భుతమైన ప్రమోషనల్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 5, 6 తేదీల్లో ప్రతి ఒక్కరికీ ఫ్రీగా సేవలు అందించనుంది. ఈ ఆఫర్ నేు సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు అనిల్ కపూర్, యామీ గౌతమ్, నవాజుద్దీన్ సిద్దిఖీలు. ఈ ప్రయోగంతో మంచి రెస్పాన్స్ వస్తే ఇతర దేశాల్లోనూ ఇదే అమలు చేయాలనుకుంటున్నారట.

గతంలో నెట్ ఫ్లిక్స్ వన్ మంత్ ఫ్రీ ట్రయల్ అనే ఆఫర్ ఇచ్చింది. కాకపోతే అప్పుడు మన కార్డ్ డిటైల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ సారి మాత్రం అలాంటిదేం లేకుండానే రెండు రోజుల ప్రమోషనల్ ఆఫర్ ఇస్తుందట. కేవలం యూజర్లు పేరు, ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్, పాస్ వర్డ్ తో రిజిష్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది.



‘మాకు తెలిసి దేశంలో ప్రతి ఒక్కరికీ ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ అందిస్తుంటే కొత్త వారికి ఇందులో ఉండే స్పెషాలిటీ, సర్వీస్ గురించి తెలుసుకుంటారని అనుకుంటున్నాం’ అని నెట్‌ఫ్లిక్స్ సీఓఓ గ్రెగ్ పీటర్స్ గతనెలలో జరిగిన కాన్ఫిరెన్స్ కాల్ లో అన్నారు.

ఇదిలా ఉంచితే ఈ ఓటీటీ ప్లాట్ ఫాం ఇండియాలో మరి కొద్ది ప్లాన్లు తీసుకొచ్చింది. మొబైల్ యూజర్లు నెలకు రూ.199చెల్లించి వాడుకోవచ్చు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న డిస్నీ+హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్‌లకు కాంపిటీషన్ ఇవ్వాలని ట్రై చేస్తుంది.

మరి నెట్‌ఫ్లిక్స్ ప్రమోషనల్ ఆఫర్లో చెప్పిన విధంగా మీరూ డిసెంబర్ 5, 6తేదీల్లో ఏదైనా ప్లాన్స్ పెట్టుకుంటే క్యాన్సిల్ చేసేసుకోండి!