ITR e-filing 2.0 Portal : ఈ-ఫైలింగ్ పోర్టల్ 2.0 లాంచ్.. కొత్త వెబ్‌సైట్ ఇదే..

కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ జూన్ 7 నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఆదాయ పన్ను శాఖ ఈ కొత్త వెబ్ సైట్‌ను లాంచ్ చేసింది. పన్నుదారులకు సౌకర్యవంతమైన వెబ్ ఎక్స్ పీరియన్స్ అందించేలా పోర్టల్ రూపొందించారు.

ITR e-filing 2.0 Portal : ఈ-ఫైలింగ్ పోర్టల్ 2.0 లాంచ్.. కొత్త వెబ్‌సైట్ ఇదే..

New Income Tax E Filing Website Live, Itr E Filing 2.0 Portal Launched

ITR e-filing 2.0 Portal : కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ జూన్ 7 నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఆదాయ పన్ను శాఖ ఈ కొత్త వెబ్ సైట్‌ను లాంచ్ చేసింది. పన్నుదారులకు సౌకర్యవంతమైన వెబ్ ఎక్స్ పీరియన్స్ అందించేలా పోర్టల్ రూపొందించారు. ఈ-ఫైలింగ్ 2.0 పోర్టల్ ఇప్పటికే ప్రారంభమైంది. కానీ, అధికారికంగా సోమవారం నుంచే అందుబాటులోకి వచ్చింది. రిటర్న్స్ దాఖలును మొబైల్ ఫోన్‌లోనే చేసుకునే విధంగా ఈ-ఫైలింగ్ పోర్టల్ రూపొందించారు.

ఇప్పటి వరకు ఉన్న పాత వెబ్‌సైట్ స్థానంలో కొత్తగా (www.incometax.gov.in) వెబ్ సైట్ అందుబాటులోకొచ్చింది. ముందుగా పూర్తి చేసిన ఐటీ ఫారమ్స్ ఈ వెబ్‌సైట్‌లో పొందవచ్చు. రిటర్న్స్‌ను ఎలా దాఖలు చేయాలనే అంశాలపై వీడియోలు వంటి సమాచారం పొందవచ్చు. కొత్త పోర్టల్ కార్యకలాపాలు జూన్ 7వ తేదీ నుంచి ప్రారంభమైనట్టు ఆదాయ పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ ప్రారంభించడంతో పాటు, ఆదాయపు పన్ను శాఖ ఐటిఆర్ -1, ఐటిఆర్ -2, 4 ఫారమ్‌ల కోసం ఉచితంగా ఐటిఆర్ తయారీ సాఫ్ట్‌వేర్‌ను కూడా అందిస్తోంది. కొత్త ఐటిఆర్ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ లింక్ www.incometax.gov.in లో కొత్త ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయవచ్చు.

ఒకే డాష్‌బోర్డ్ మీద అన్ని రకాల అప్‌లోడ్స్, పెండింగ్స్ తెలుసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, ఆర్టీజీఎస్, నెఫ్ట్, యూపీఐ ఇతర మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. పన్నుచెల్లింపుదారులు క్షణాల్లో అకౌంట్లను చెక్ చేసుకోవచ్చు. పన్నుచెల్లింపుదారులకు హెల్ప్ డెస్క్ సౌకర్యం కూడా ఉంది.