రియల్ హీరో : అభినందన్ ధైర్య సాహసాలను మెచ్చుకున్న మంత్రి

శత్రు దేశంలో ఉన్నా అధైర్యపడలేదు. శత్రువులు చుట్టుముట్టినా భయపడలేదు. ధైర్య సాహసాలతో వారిని ఎదుర్కొని రియల్ హీరో అనిపించుకున్నారు. ఆయనే భారత ఎయిర్ ఫోర్స్

  • Published By: veegamteam ,Published On : March 2, 2019 / 01:30 PM IST
రియల్ హీరో : అభినందన్ ధైర్య సాహసాలను మెచ్చుకున్న మంత్రి

శత్రు దేశంలో ఉన్నా అధైర్యపడలేదు. శత్రువులు చుట్టుముట్టినా భయపడలేదు. ధైర్య సాహసాలతో వారిని ఎదుర్కొని రియల్ హీరో అనిపించుకున్నారు. ఆయనే భారత ఎయిర్ ఫోర్స్

శత్రు దేశంలో ఉన్నా అధైర్యపడలేదు. శత్రువులు చుట్టుముట్టినా భయపడలేదు. ధైర్య సాహసాలతో వారిని ఎదుర్కొని రియల్ హీరో అనిపించుకున్నారు. ఆయనే భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్. పాకిస్తాన్ చెర నుంచి క్షేమంగా బయటపడిన అభినందన్… శుక్రవారం(మార్చి-1-2019) రాత్రి వాఘా బోర్డర్‌లో మాతృభూమిపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అభినందన్‌ను ఎయిర్‌ఫోర్స్ ఆస్పత్రికి తరలించారు.

రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(మార్చి 2) ఎయిర్‌ఫోర్స్ ఆస్పత్రిలో అభినందన్‌ను కలుసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పాక్ చెరలో ఉన్న సమయంలో అభినందన్ చూపిన ధైర్యసాహసాలను కేంద్రమంత్రి మెచ్చుకున్నారు. దేశం కోసం అంకితభావంతో పోరాడిన అభిని అభినందించారు. రక్షణ మంత్రి వస్తున్నారని తెలుసుకున్న అభినందన్ యూనిఫామ్ ధరించారు. డ్యూటీలో ఉన్న సైనికుడిలా తయారయ్యారు. పాకిస్తాన్‌లో ఉన్న 60 గంటల సమయంలో ఏమేం జరిగిందో మంత్రికి అభినందన్ వివరించారు. వైద్య చికిత్సల అనంతరం డీ-బ్రీఫింగ్ సెషన్ ప్రారంభం కానుంది. ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు ఐబీ, రా అధికారులు అభినందన్‌ను ప్రశ్నించనున్నారు.

పాక్ కస్టడీలో ఉన్నప్పుడు అతడి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు చిత్రహింసలు పెట్టారా? అనే కోణంలోనూ ప్రశ్నించనున్నారు. వైద్య పరీక్షల్లో భాగంగా… అభినందన్ ఫిట్‌నెస్ ఎలా ఉంది? అతడి మానసిక స్థితి సవ్యంగానే ఉందా? అనే అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా, పాక్ నిఘా సంస్థలు అభినందన్ శరీరంలో రహస్యంగా ఏమైనా ఎలక్ట్రానిక్ బగ్‌లు పెట్టాయా అనే కోణంలోనూ పరీక్షలు నిర్వహిస్తారు. అభినందన్ కోసం ప్రశ్నావళి రూపొందించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిఘా విభాగం అడిగే ఆ ప్రశ్నలకు అభినందన్ ఇచ్చే జవాబుల ఆధారంగా అతడి మానసిక స్థితిని, ఆలోచన విధానాన్ని విశ్లేషిస్తారు.