Nityananda swamy : నిత్యానందకి ఏమైంది..?తానే దేవుడినని ప్రకటించుకున్న స్వామికి వింత జబ్బు..27 మంది వైద్యులతో చికిత్స..!

నేనే నిత్యం నేనే సత్యం అన్నాడు. నేనే దేవుడ్ని అని చెప్పాడు. కైలాసమే తన దేశమని ప్రకటించుకున్నాడు. ప్రత్యేక కరెన్సీని కూడా ముద్రించుకున్నాడు. తన దేశానికి వచ్చే భక్తులకు నేరుగా పరమశివుడి దర్శనమే చేయిస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఓ వింత రోగం బారిన పడి వైరాగ్యంతో మాట్లాడుతున్నాడు. సమాధిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఇంతకీ నిత్యానందుడికి ఏమైంది ? తానే దేవుడినని ప్రకటించుకున్న వ్యక్తికి వచ్చిన జబ్బేంటి ?

Nityananda swamy : నిత్యానందకి ఏమైంది..?తానే దేవుడినని ప్రకటించుకున్న స్వామికి వింత జబ్బు..27 మంది వైద్యులతో చికిత్స..!

Non-bailable warrant against Nithyananda:

Nityananda swamy : నేనే నిత్యం నేనే సత్యం అన్నాడు. నేనే దేవుడ్ని అని చెప్పాడు. కైలాసమే తన దేశమని ప్రకటించుకున్నాడు. ప్రత్యేక కరెన్సీని కూడా ముద్రించుకున్నాడు. తన దేశానికి వచ్చే భక్తులకు నేరుగా పరమశివుడి దర్శనమే చేయిస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఓ వింత రోగం బారిన పడి వైరాగ్యంతో మాట్లాడుతున్నాడు. సమాధిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఇంతకీ నిత్యానందుడికి ఏమైంది ? తానే దేవుడినని ప్రకటించుకున్న వ్యక్తికి వచ్చిన జబ్బేంటి ? రోగమే అతనిలో వైరాగ్యాన్ని పెంచిందా ?

తినాలన్న ఆశా లేదు.. బతకాలన్న కోరికా లేదు.తెలిసిన వాళ్లను గుర్తుపట్టలేనంతలా మతిమరుపు..వింత రోగంతో నిత్యానందుడిలో పెరిగిన వైరాగ్యం..సమాధిలోనే 27 మంది వైద్యులతో చికిత్స..నిత్యానందస్వామి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అతను బోధించే ఆధ్మాత్మిక విషయాల సంగతి పక్కన పెడితే.. లైంగిక ఆరోప‌ణ‌లతో బాగా ఫేమస్ అయిపోయాడు. వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఎప్పుడు చూసినా.. తానే దేవుడినని చెబుతాడు. మన దేశంలో బాబాలకు వాళ్లను కొలిచే బకరాలకు ఏమాత్రం కొదువ లేదు. అలానే నిత్యానందకు కూడా పెద్ద సంఖ్యలోనే భక్తులున్నారు. అయితే అత్యాచారం, మహిళల అక్రమ నిర్బంధం ఆరోపణలు, కోర్టు కేసులతో ఒక్కసారిగా నిత్యానందుడు దేశం నుంచి మాయమయ్యాడు. ఈక్వెడార్ దగ్గరలోని ఒక దీవిని సొంతం చేసుకుని దానికి కైలాస దేశమని పేరు కూడా పెట్టి అక్కడే ఉంటున్నాడు. ఆ మధ్య జీవ సమాధి పేరుతో తనను తానే కప్పెట్టుకుని చిన్న డ్రామా ప్లే చేశాడు. ఆ తర్వాత అతను మరి కనిపించలేదు. అంతా పైకి పోయాడులే అనుకున్నారు. ఈ వార్తలు గుప్పుమనేసరికి నిత్యానందుడు నిద్ర లేచాడు. తాను బతికే ఉన్నానని ప్రకటించుకున్నాడు. కాకపోతే అప్పుడున్నంత ఎనర్జీ ఇప్పుడు లేదు. కొత్త రోగం దానికి తోడు వైరాగ్యం నిత్యానందను ఆవహించింది. తినాలన్న కోరికా లేదు.. బతకాలన్న ఆశాలేదు… అలాగని ఈ ప్రాపంచిక జీవితంపై ద్వేషం కూడా లేదంటూ.. ఏదేదో పిచ్చిపిచ్చి పోస్టులు పెడుతున్నాడు. అందుకే ఈ నిత్యానందుడికి ఏమైంది ? అన్న సందేహం అందరిలోనూ కలుగుతోంది.

Also read : Nithyananda:మదురై శైవ మఠంపై కన్నేసిన నిత్యానంద..నేనే పీఠాధిపతిని అంటూ ప్రకటన

ఏదీ తినలేకపోతున్నాడట..! ఏదీ తాగలేకపోతున్నాడట..! సరిగా నిద్రపట్టడం లేదట..! కనీసం మాట్లాడలేకపోతున్నాడు… తన చుట్టూ ఉన్నవాళ్లను గుర్తు పట్టలేకపోతున్నాడు.. అయినా ఆరోగ్యంగానే ఉన్నాడట..! కానీ 27 మంది వైద్యులు చికిత్స అందిస్తున్నారట..!! ఇందులో దేనికీ… లింకు కుదరట్లేదు కదా..! నిత్యానందుడి మాటల్లో లాజిక్‌ వెతకడం… సముద్రంలో సూదిని వెతకడం కన్నా అవివేకం మరొకటి ఉండదు. ఇదంతా చూస్తుంటే నిత్యానంద మెదడులో చిప్పు పని అయిపోయినట్లుంది. కైలాసలో బకరా భక్తుల సొమ్ముతో నిత్యానంద సకల సౌకర్యాలతో రాజభోగాలు అనుభవిస్తున్నాడని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ అతను తీవ్ర పేదరికంలో ఉన్నాడని… అక్కడి నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తే కటకటాల రుద్రయ్యగా మారుతాడన్న భయంతో కైలాస వదలి రావడం లేదన్న ప్రచారం కూడా జరిగింది. ఇదే సమయంలో నిత్యానంద ఆరోగ్యం క్షీణించి సమాధి నుంచి నేరుగా పైకి టికెట్‌ తీసుకున్నాడని వార్తలొచ్చాయి. దీంతో ఈ వార్తలను నిత్యానంద ఖండించాల్సి వచ్చింది. లాస్ అవతార్ క్లిక్స్ అనే ఫేస్‌బుక్ పేజీలో తాను ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అనేది వివరించాడు.

ప్రస్తుతం నిత్యానందుడి పరిస్థితి కలుగులో ఉన్న ఎలక మాదిరి మారిపోయింది. అక్కడ ఉండలేడు.. అలాగని అక్కడి నుంచి బయట పడలేడు. వీవీఐపీలకు ఆరోగ్యం బాగోలేకపోయినా..27 మంది వైద్యులు వచ్చి చికిత్స చేయరు. కానీ నిత్యానందుడికి మాత్రం అంతమంది డాక్టర్లు చికిత్స అందిస్తున్నారట. ఆయన దేశంలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడంతో.. ఆయన భక్తుల్లోని డాక్టర్లే చికిత్స చేస్తున్నారని చెబుతున్నాడు. అయితే నిత్యానంద తన పోస్టులో పెట్టినట్లుగా.. తినలేకపోవడం, నిద్ర పట్టకపోవడం, మనుషుల్ని గుర్తు పట్టలేకపోవడం.. ఇదంతా చూస్తుంటే ఏదో వింత జబ్బు బారిన పడ్డట్లే ఉన్నాడు స్వామి. ఇలాంటి పరిస్థితుల్లోనూ నిత్యానందకు కామెడీ టైమింగ్‌ ఏమాత్రం తగ్గలేదు. తాను బతికే ఉన్నానన్న విషయం నమ్మకపోతే… తిరుమన్నామలై అరుణగిరిలోని యోగేశ్వర సమాధికి వెళ్లాలట… అక్కడ నిత్యానందుడి దర్శనం భక్తులు దొరుకుతుందట. ఈక్వెడార్‌లోని ఓ దీవిలో ఓ చిన్న సమాధి తవ్వుకుని అందులో కూర్చున్న నిత్యానంద… తమిళనాడులోని అరుణగిరి యోగేశ్వర సమాధిలో ఎలా కనిపిస్తాడు ? పిచ్చి కాకపోతే..! అంతేకాదు అక్కడ నిరంతరం వెలిగే జ్యోతి ఉన్నంత కాలం తన ప్రాణం కూడా నిలిచే ఉంటుందట. నిత్యానంద రోగం బారిన పడ్డా… వైరాగ్యం చుట్టుముట్టినా.. ఈ పిచ్చి మాత్రం అస్సలు తగ్గలేనట్లుంది. అందుకే ఇలాంటి పోస్టులు పెడుతున్నాడు.

Also read : Nithyananda: ఇండియాకు నేనొస్తే కరోనా ఖతం అంతే..

ఆరు నెలల నుంచి నిత్యానంద అనారోగ్యంతోనే ఉన్నాడని తెలుస్తోంది. అయితే తనకు క్యాన్సర్ లాంటి రోగాలు లేవని.. అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తున్నాయని అతనే చెప్తున్నాడు. బలవంతంగా ఆహారాన్ని తీసుకున్నా సరిగా జీర్ణం కావడం లేదట. సమాధిలోనే నిత్య పూజలు చేస్తున్నానని చెబుతున్నాడు. తాను దేవుడి అవతారమంటాడు..! మరి ఈ నిత్య పూజలు ఎవరికి చేస్తున్నాడో అర్థం కాదు. సుమారు ఆరు నెలల నుంచి నిద్రాహారాలు లేక అవస్థలు పడుతున్నాడట.సాధారణంగా ఎవరైనా ఓ వారం రోజులు సరిగ్గా ఆహారం తీసుకోకపోయినా..నిద్రపోకపోయినా..పూర్తిగా అనారోగ్యం పాలవుతారు. అదే పరిస్థితి మరో వారం కంటిన్యూ అయితే పైకి టపా కట్టేస్తారు. కానీ నిత్యానందుడు మాత్రం ఆరు నెలల నుంచి అదే పరిస్థితి ఉన్నా… అతనికి ఏమీ కాలేదట. ఇదంతా నిజం కాకపోయినా.. నిత్యానందుడికి అనారోగ్యం అన్నది మాత్రం నిజమే ! దేశంలో ఉండేటప్పుడు అతని ఆటలు బాగానే సాగాయి. కానీ ఈక్వెడార్‌లో దీవికి వెళ్లిన తర్వాత.. పరిస్థితి దిగజారడం మొదలైంది. ప్రస్తుతం అరకొరగా అతని చుట్టూ ఉండే బకరాలు ఏవో సేవలు చేస్తున్నారు. పూర్తిగా అనారోగ్యం బారిన పడడం.. మెరుగైన చికిత్స తీసుకునే అవకాశం లేకపోవడంతో.. నిత్యానందుడికి జీవితంపై విరక్తి – వైరాగ్యం మొదలైనట్లుంది. అతని పోస్టులు చూస్తుంటే అదే అనిపిస్తోంది.