UP Assembly Elections : రోడ్లు బాగు చేయరా ? ఎన్నికలను బహిష్కరిస్తామన్న గ్రామస్తులు

రిగ్గా ఎన్నికల సమయంలో...నేతలకు ఝులక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. వెంటనే రోడ్లు బాగు చేయించకపోతే...ఎన్నికలను బహిష్కరిస్తామని ఆల్టీమేటం జారీ చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న...

UP Assembly Elections : రోడ్లు బాగు చేయరా ? ఎన్నికలను బహిష్కరిస్తామన్న గ్రామస్తులు

Up Election

No Road No Vote : ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ…అభ్యర్థుల్లో ఫుల్ టెన్షన్ నెలకొంది. తాము గెలుస్తామా ? లేదా ? అనే ఉత్కంఠలో ఉంటున్నారు. ప్రజలను ఆకర్షించడానికి వారు పడరాని పాట్లు పడుతున్నారు. దీనికంటే మంచి తరుణం రాదని కొంతమంది ప్రజలు అనుకున్నారు. రోడ్లు బాగు లేవు..సరి చేయాలని కోరుతున్నా చెవులకు వినిపించుకోని ప్రజా ప్రతినిధులకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. రోడ్లను బాగు చేయలేకపోతే…ఎన్నికలను బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఘటన యూపీలోని ఈఠ్ సర్దార్ నియోజకవర్గంలోని కుల్లా హబీబ్ పూర్ లో చోటు చేసుకుంది.

Read More : Gudiwada: క్యాసినో వివాదం.. టీడీపీ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు

హబీబ్ పూర్ గ్రామంలో రోడ్ల పరిస్థితి ఏమాత్రం బాగా లేదని..సరి చేయించాలని ఎన్నోమార్లు కోరారు. రోడ్లు అధ్వాన్నస్థితికి చేరుకోవడంతో తాము ప్రయాణించాలంటే..ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నట్లు వెల్లడించారు. అయినా..అటు అధికారులు..ఇటు నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సరిగ్గా ఎన్నికల సమయంలో…నేతలకు ఝులక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. వెంటనే రోడ్లు బాగు చేయించకపోతే…ఎన్నికలను బహిష్కరిస్తామని ఆల్టీమేటం జారీ చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న అధికారులు వారితో చర్చించారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని సబ్ డివిజనల్ అధికారి వెల్లడించారు. వెంటనే రోడ్లను బాగు చేస్తామని హామీనివ్వడంతో తాము తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

Read More : AAGMC Teaser : యాక్టర్‌గా నటించడానికి డాక్టర్ పెట్టిన కండీషన్ ఏంటి?

ఉత్తరప్రదేశ్ లో ఫిబ్రవరి 10నుంచి జరగనున్న ఏడు దశల ఎన్నికల ప్రకియలో 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, మార్చి 7తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ మార్చి10నుంచి మొదలవుతుంది.