Gangrene : కరోనాతో పేగుల్లో ‘గాంగ్రీన్’​..ముంబైలో 12, గుజరాత్ లో 100 కేసులు

కరోనాతో సోకి కోలుకున్నాక పలు రకాల ఫంగస్ దాడిచేస్తున్నాయి. కరోనా సోకనివారిలో కూడా బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించటంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నాడు డాక్టర్లు. వీటికి తోడు కరోనాతో మరో పెద్ద సమస్య వచ్చిపడింది.అదే గాంగ్రీన్, పేగుల్లో గడ్డలుగా తయారై కొత్త సమస్యలకు దారి తీస్తోంది. పేగుల్లో ‘గాంగ్రీన్’​..ముంబైలో 12, గుజరాత్ లో 100 కేసులు

Gangrene : కరోనాతో పేగుల్లో ‘గాంగ్రీన్’​..ముంబైలో 12, గుజరాత్ లో 100 కేసులు

Gangrene

Covid Induced Gangrene in Intestines : కరోనా సోకి కోలుకున్నాక హమ్మయ్యా బతికి బైటపడ్డాం అని అనుకోవటానికి లేకుండా పోయింది ప్రస్తుతం పలు రకాల ఫంగస్ లతో. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్,ఎల్లో ఫంగస్ లు కరోనాతో కోలుకున్నవారిపై మూకుమ్మడి దాడిచేస్తున్నాయి. కరోనా సోకనివారిలో కూడా బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించటంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నాడు డాక్టర్లు. మరోవైపు ప్రజలు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. కానీ ఇప్పుడు కరోనాతో మరో పెద్ద సమస్య వచ్చి పడింది. అదే ‘గాంగ్రీన్​’ (gangrene)కరోనా సోకినవారికి ఈ ‘గాంగ్రీన్​’ సమస్య వచ్చి పడింది. కరోనాతో మరో పెద్ద సమస్య.. పేగుల్లో గాంగ్రీన్​​ సమస్యతో పేగుల్లో గడ్డలు తయారవుతున్నాయి. ముంబైలో ఈ గ్యాంగ్రీన్ కేసులు 12 వెలుగులోకొచ్చాయని డాక్టర్లు వెల్లడించారు. ముంబై నగర వ్యాప్తంగా ప్రతి ఆసుపత్రిలోనూ గాంగ్రీన్​ కేసులున్నాయని నిపుణులు వెల్లడించారు. అలాగే గుజరాత్ లోని రాజ్ కోట్ లో వంద మందికి ఈ గాంగ్రీన్​ సమస్యలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

కరోనా అనుకుంటే..దానికితోడు కొత్త కొత్త సమస్యలు జనాలకు కుదురు లేకుండా చేస్తున్నాయి.ముఖ్యంగా కరోనా బాధితులకు ఇవి ప్రాంతాకంగా మారాయి. బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ లే ఎటాక్ చేస్తున్నాయనుకుంటే.. శరీర అవయవాలు, గుండె, మెదడులో రక్తం గడ్డకట్టిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా పేగుల్లోనూ క్లాట్స్ (గడ్డలు) వస్తున్నాయి. అవి గ్యాంగ్రీన్లుగా మారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.గ్యాంగ్రీన్ అంటే మాంసాన్ని కుళ్లిపోయేలా చేసేది. లేదా మాంసాన్ని తినేసే పుండు అని నిపుణులు చెబుతున్నారు.

ముంబైలోని దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ ఇప్పుడు ఈ గాంగ్రీన్​ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటిదాకా కేవలం 12 కేసులు బయటకు వచ్చాయని వెల్లడించారు. ఎవరైనా కరోనాతో కోలుకున్నాక భరించలేని నొప్పులు, కడుపునొప్పి వంటివి వస్తే అస్సలు ఆలస్యం చేయొద్దని వెంటనే నిపుణులకు చూపించుకుని చికిత్స పొందాలని సూచిస్తున్నారు.

ఇటీవల హోలీ స్పిరిట్ ఆసుపత్రిలో సునీల్ గవాలీ అనే వ్యక్తికి ఇదే సమస్య వచ్చిందని ఆ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. అప్పటికే అతడిలో పేగులోని గడ్డ కాస్తా గ్యాంగ్రీన్ గా మారిపోయిందని..వెంటనే తగిన చికిత్స చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. అనంతరం బాధితుడికి సీటీ స్కాన్ చేయగా.. పేగులకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టినట్టు తేలింది. ఇప్పటిదాకా ముంబైలో 12కేసులు వెలుగులోకి రాగా.. గుజరాత్ లోని రాజ్ కోట్ లో 100 కేసలు దాకా వచ్చినట్లుగా తెలుస్తోంది.