కాలేజ్ ఫీజ్ కట్టటానికి కూలి పనులు చేస్తున్నఇంజనీరింగ్ విద్యార్థిని

కాలేజ్ ఫీజ్ కట్టటానికి కూలి పనులు చేస్తున్నఇంజనీరింగ్ విద్యార్థిని

Odisha engineering student works as a daily Labor work : కాలేజీ ఫీజు కట్టటానికి ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఉపాధి హామీ కూలీగా మారింది. తనతోపాటు తన చెల్లెళ్లను చదివించుకోవటానికి కూలీగా మారింది. మట్టిపనిచేస్తోంది. బరువులు మోస్తోంది. చెమలు చిందించి కష్టపడి పనిచేస్తోంది. లక్ష్మీదేవీ, సరస్వతీ దేవి ఒకేచోట ఉండవన్నట్లుగా చదువుల తల్లి అయిన విద్యార్ధిని కష్టపడితేనే గానీ కాలేజీ ఫీజులు కట్టలేని దుస్థితిలో ఉంది.

 

ఒడిశా రాష్ట్రంలోని పూరి జిల్లాలోని చైన్‌పూర్ పంచాయతీ పరిధిలోని గోరదిపిధా గ్రామానికి చెందిన రోజీ బెహెరా అనే యువతి ఇంజినీరింగ్ చదువుతోంది. రోజీ బెహరాది పేద కుటుంబం. రోజీ బెహెరాకు నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. అసలే పేద కుటుంబం. రెక్కాడితేనే గానీ డొక్కాని పరిస్థితి. దీనికి తోడు వారిని చదివించాలంటే తలకుమించిన భారం అయ్యిందా పేద తల్లితండ్రులకు.

దీంతో కాలేజీ ఫీజుల కోసం రోజీ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద కూలీగా మారింది. రోజీ చెల్లెళ్లు ఒకరు ఇంటర్, మరొకరు 7 th, మరొకరు 5th చదువుతున్నారు. రోజీ తన కాలేజీ ఫీజు కట్టటం కోసం తన ముగ్గురు చెల్లెళ్లతో కలిసి ప్రతీరోజు ఉదయాన్నే నిద్ర లేచి పలుగు, పార, బుట్ట పట్టుకొని కూలి పనికి వెళ్లాల్సిన వస్తోంది.ఈ సందర్భంగా రోజీ మాట్లాడుతూ..‘నేను 2019లో ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజినీరింగులో డిప్లో చేశాను. దానికి రూ.44వేల ఫీజు బకాయి ఉంది. నాన్న రూ.20వేలు ఇచ్చాడు. మిగతా డబ్బును కూలీగా పనిచేసి సంపాదించి ఫీజు బకాయిలు చెల్లించి సర్టిఫికెట్ తీసుకుంటాను’’ అని రోజీ చెప్పింది.

గత 20 రోజులుగా తాను రోజుకు 207 రూపాయల వేతనంపై ఉపాధిహామి పథకం కింద కూలీగా పనిచేస్తున్నానని…నాతో పాటు నా చెల్లెలు కూడా నాకు సహాయంగా వస్తోందని రోజీ చెప్పింది. నా తల్లిదండ్రులు, తాత ప్రతీరోజు ఉపాధిహామీ పనులు చేస్తుంటారని చెప్పింది.రోజు పరిస్థితిపై స్పందించిన పూరి జిల్లా కలెక్టరు సమంత్ వర్మ మాట్లాడుతూ రోజీ ఫీజు బకాయిలను చెల్లించేందుకు తాము అధికారిని పంపించామని, రోజీ విద్యకు తాము ఏర్పాట్లు చేస్తామని కలెక్టరు వర్మ చెప్పారు. దీనిపై డెలాంగ్ బ్లాక్ బ్లాక్ వెల్ఫేర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ శేష్‌దేవ్ రౌట్ మాట్లాడుతూ..ఆర్థిక పరిస్థితి కారణంగా రోజీ కాలేజీ ఫీజు కట్టలేకపోయింది. దీంతో ఆమెకు డిప్లొమా సర్టిఫికేట్ రాలేదు. ఈ విషయాన్ని పరిశీలించి ఆమెకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.