Omicron In India : దేశంలో కోవిడ్ పరిస్థితిపై మోదీ సమీక్ష!

దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితిపై మోదీ

Omicron In India : దేశంలో కోవిడ్ పరిస్థితిపై మోదీ సమీక్ష!

Modi

Omicron In India : దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితిపై మోదీ నిర్వహించే ఈ రివ్యూ మీటింగ్ లో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు,చర్యల గురించి అధికారులు మోదీకి వివరించనున్నారు.

కిస్మస్,నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఒమిక్రాన్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు కేంద్రం పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు క్రిస్మస్,న్యూఇయర్ వేడకులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

మరోవైపు,దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”కేసుల సంఖ్య 213కి చేరింది. నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు ఢిల్లీ, మహారాష్టలో నమోదయ్యాయి. ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54 కేసులు,ఆ తర్వాత తెలంగాణలో అత్యధికంగా 24 కేసులు నమోదయ్యాయి. ఇంతవరకూ 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు గుర్తించారు.

ఇక,మంగళవారం 6,317కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 78,190గా ఉంది.

ALSO READ Unstoppable with NBK: బాలయ్య టాక్ షో.. మహేష్‌తో లాస్ట్ ఎపిసోడ్